Prabhas: తప్పు తెలుసుకున్న ప్రభాస్.. ఇక వాటి జోలికెళ్ళడట..!

‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత ‘రాఘవేంద్ర’ మూవీలో కూడా నటించాడు. అయితే ఇతనికి మొదటి హిట్ ను అందించింది ‘వర్షం’ మూవీ. ఇది ఒక లవ్ స్టోరీ. అటు తర్వాత ‘ఛత్రపతి’ తో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్నాడు ప్రభాస్. తర్వాత అతను ‘పౌర్ణమి’ అనే లవ్ స్టోరీని చేసాడు. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ చేయాల్సిన మూవీ కాదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.

Click Here To Watch NOW

ఆ తర్వాత ప్లాపులు, యావరేజ్ లతో కాలం గడుపుతున్న ప్రభాస్ కు ‘డార్లింగ్’ అనే లవ్ స్టోరీ హిట్ ట్రాక్ ను ఎక్కించింది. ఆ తర్వాత ప్రభాస్ చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న లవ్ స్టోరీనే..! అయితే ‘మిర్చి’ ‘బాహుబలి'(సిరీస్) లతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ టైములో అతను లవ్ స్టోరీలు చేస్తే చూడ్డానికి ప్రేక్షకులు కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ కానీ రెడీగా లేరని ‘రాధే శ్యామ్‌’ ప్రూవ్ చేసింది.

‘నన్ను ఇప్పుడు ఎవ్వరూ రొమాంటిక్ గా చూడాల‌నుకోవ‌డం లేదు, మ‌రీ అంత సాఫ్ట్ క్యారెక్ట‌ర్లు నాకు సూట్ అవ్వవు అని తెలిసింది’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. అది నిజమే.! పైగా ప్రభాస్ వయసు కూడా 43 ఏళ్ళు. కాబట్టి అతన్ని లవర్ బాయ్ గా జనాలు ఊహించుకోలేరు. ప్రభాస్ ను హిట్ ట్రాక్ ఎక్కించింది లవ్ స్టోరీలే కావచ్చు… కానీ ఇప్పుడు అతన్నుండీ భారీ యాక్షన్ డ్రామాలు, కుదిరితే అందులో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి ఉంటే బాగుణ్ణు అని కోరుకుంటున్నారు.

ప్రభాస్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. కానీ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తరుణంలో అన్ని జోనర్లు టచ్ చేయాలనే కన్ఫ్యూజన్లోకి వెళ్లినట్టు కూడా తెలిపాడు. మొత్తానికి అతను లవ్ స్టోరీలకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు కూడా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus