Prabhas Shirt Cost: బాలయ్య షోలో ప్రభాస్ షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘అన్‌స్టా‌పబుల్ విత్ యన్‌‌బికె’ షోకి.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా వస్తున్నారని తెలిసినప్పటినుండి ఈ హీరోలిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు.. ప్రభాస్ ఫస్ట్ సీజన్‌లోనే రావాల్సింది కానీ బిజీ షెడ్యూల్స్ కారణంగా కుదర్లేదు.. మొత్తానికి ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఆదివారం (డిసెంబర్ 11) డార్లింగ్.. బాలయ్య షోకి వచ్చారు..షోలో పార్టిసిపెట్ చేసిన ఫ్యాన్, ఆడియన్స్ ద్వారా కొన్ని ఫోటోలతో పాటు ఓ వీడియో కూడా బయటకొచ్చింది..

ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.. ఈ వీడియో చూసి బాలయ్య – ప్రభాస్ అభిమానులే కాదు.. తెలుగు ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.. డార్లింగ్ ఎప్పటిలానే బ్లాక్ షర్ట్ లేదా టీషర్ట్, బ్లాక్ క్యాప్ అండ్ గాగుల్స్‌తో కనిపిస్తాడనుకున్నారు కానీ షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. ఎల్లో బ్లూ మల్టీ కలర్ షర్ట్ వేసుకుని.. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇక తమ ఫేవరెట్ స్టార్‌ని అలా చూశాక ఫ్యాన్స్ ఆగుతారా?..

వెంటనే ప్రభాస్ వేసుకున్న షర్ట్ బ్రాండ్ అండ్ కాస్ట్ డీటేల్స్ వెతికి పట్టేసుకున్నారు.. రెబల్ స్టార్ వేసుకున్నది.. ‘‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’’ (Polo Ralph Lauren Men’s Madras Button Down Shirt – Yellow/Blue Multi).. దీని కాస్ట్ 115 పౌండ్స్.. మన ఇండియన్ కరెన్సీలో 11,618.09 రూపాయలు.. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్.. ‘మాచో స్టార్’ గోపిచంద్ కూడా ఈ షోలో తనతో కలిసి పాల్గొన్నారు.. ఇక ప్రభాస్ కాలి సైజ్ అడుగుతూ..

అంత ఉంటే దాన్ని వెంకటేశ్వర స్వామి పాదం అంటారంటూ నవ్వించారు బాలయ్య.. పాన్ వరల్డ్ స్టార్, NBK మరియు గోపిచంద్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ అందరూ ఈ ఎపిసోడ్ ప్రోమో, స్ట్రీమింగ్ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. అప్పటివరకు ఈ పిక్స్, వీడియోతో ఫ్యాన్స్ నెట్టింట చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus