Prabhas: రాధేశ్యామ్ రిజల్ట్ పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన రాధేశ్యామ్ ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సాధించలేకపోవడం గమనార్హం. ప్రభాస్ అభిమానులలో మెజారిటీ ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చలేదు. అయితే తాజాగా ప్రభాస్ ఈ సినిమా ఫలితం గురించి స్పందించారు. బాహుబలి తరహా సినిమాలు చేయడం తనకు ఇష్టమేనని ప్రభాస్ అన్నారు.

Click Here To Watch NOW

అయితే బాహుబలి తరహా సినిమాలలో మాత్రమే నటిస్తే కొత్తదనం చూడలేనని ప్రభాస్ కామెంట్లు చేశారు. విభిన్నమైన సినిమాలలో నటించాలని తన కోరిక అని ప్రభాస్ వెల్లడించారు. విభిన్నమైన కథలతో తెరకెక్కే చిన్న బడ్జెట్ సినిమాలలో కూడా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. రాధేశ్యామ్ సినిమా రిలీజయ్యే సమయానికి కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గలేదని ప్రభాస్ కామెంట్లు చేశారు. నన్ను ప్రేమకథలలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చని అందుకే రాధేశ్యామ్ సక్సెస్ కాలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

రాధేశ్యామ్ మూవీ స్క్రిప్ట్ లో ఏదైనా లోపం ఉండి ఉండవచ్చని ప్రభాస్ కామెంట్లు చేశారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం కథ, కథనంలోని లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కు కారణమని భావిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమా ఫలితంపై మారుతి కెరీర్ కూడా ఆధారపడి ఉందని చెప్పవచ్ఛు. మారుతి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus