కరోనా సెకండ్ వేవ్ స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. భారీగా నమోదవుతున్న కేసుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతులు ఇస్తున్నా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలతోనే థియేటర్లకు అనుమతులు ఇస్తుండటం గమనార్హం. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవు.
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయడంలో సమస్యలు ఉన్నప్పటికీ జక్కన్న మాత్రం రిలీజ్ డేట్ విషయంలో పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను కూడా దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ కు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజైతే మాత్రం రాజమౌళికి షాక్ అనే చెప్పాలి.
రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పునర్జన్మ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. జిల్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!