Prabhas: స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ కు ఇంతకు మించి ప్రూఫ్ కావాలా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ హ్యాట్రిక్ విజయాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. బాహుబలి, బాహుబలి2 సినిమాలు ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ప్రభాస్ నటిస్తున్న ఈ నాలుగు సినిమాలకు 4,000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలకు బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ మారుతి కాంబో మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రభాస్ సినిమాల బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. ఆదిపురుష్ కు 800 నుంచి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం.

సలార్ మూవీ 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు కూడా 1000 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. కేజీఎఫ్2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.

ప్రభాస్ మారుతి కాంబో సినిమాకు 700 నుంచి 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రభాస్ సినిమాలకు 4000 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus