సాహోలో సిక్స్ ప్యాక్ చూపించనున్న ప్రభాస్
- June 14, 2017 / 08:00 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని షాట్స్ తెరకెక్కించారు. రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. గత కొంతకాలంగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రభాస్ రీసెంట్ గా నగరానికి వచ్చారు. లుక్ పై కసరత్తు చేస్తున్నారు. బాహుబలి 2 లో మాదిరిగానే సాహోలోనూ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని తాజా సమాచారం.
అందుకోసం డైట్ ని ఫాలో అవుతూ నిపుణుల పర్వవేక్షణలో వ్యాయామం చేస్తున్నారని తెలిసింది. క్లైమాక్స్ ఫైట్ లో ప్రభాస్ ని సుజీత్ కొత్తగా చూపించే ఆలోచనతో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















