Prabhas: ‘యానిమల్‌’కి మించిన వయలెన్స్‌ ‘స్పిరిట్‌’లో… నిజమేనా?

‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూసినప్పుడు.. ఏంటిది ఇంత వయెలెంట్‌గా ఉంది అని అనుకున్నారంతా. అంతేకాదు రెండో సినిమాలో ఇంకెంత వయలెన్స్‌ చూపిస్తాడో అని అనుకున్నారంతా. అయితే ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ అనే పేరుతో తెరకెక్కించారు. దీంతో సేమ్‌ వయెలన్స్‌ దొరికింది. కానీ మూడో సినిమాకు వచ్చేసరికి సందీప్‌ రెడ్డి వంగా అసలు సిసలు వయెలెన్స్‌ చూపించారు. అదే ‘యానిమల్‌’. అయితే ఇది అసలు సిసలు వయలెన్స్‌ కాదు.. అంతకుమించి నెక్స్ట్ సినిమాలో ఉంటుంది అంటున్నారు.

అవును, మీరు చదివింది కరెక్టే. ‘యానిమల్‌’ సినిమా ట్రైలర్‌లో ఉన్న వయెలెన్సే ఎక్కువ ఉంది… సినిమాలో ఇంకా ఉంది అని అనుకుంటుండగా… ‘స్పిరిట్‌’లో ఇంకా చాలా ఉంటుందట. ఎందుకంటే భయమే లేని కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ కథను ‘స్పిరిట్‌’ సినిమాలో చూపించబోతున్నాడు. ఇప్పటివరకు చూసిన ప్రభాస్‌ కాదు… అంతకుమించి అనే రేంజిలో ఈ సినిమాలో ప్రభాస్‌ కనిపిస్తాడు అని టీమ్‌ సమాచారం. అందుకు తగ్గట్టు ఇప్పుడు ‘యానిమిల్‌’ ప్రచారంలో మాటలు వినిపిస్తున్నాయి.

ముంబయిలోని స్పిరిట్‌ మాఫియాను ఈ సినిమాలో చూపిస్తారు అని ఇప్పటికే చెప్పేశారు. స్క్రిప్ట్ ఏ దశలో ఉందో ఇంకా తెలియదు కానీ… కథ, కథనంలో వయెలెన్స్‌ పాళ్లు భారీగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ సినిమాను తొలుత 2025లో విడుదల చేస్తారని చెప్పారు. కానీ సందీప్‌ రెడ్డి వంగా సినిమా నిర్మాణానికి తక్కువ సమయమే తీసుకుంటారు. ఆ లెక్కన ‘స్పిరిట్‌’ సినిమా 2024లో వస్తుందని చెబుతున్నారు. కాబట్టే వచ్చే ఏడాదే సినిమాను చూడొచ్చు.

‘బాహుబలి’ సినిమాల తర్వాత (Prabhas) ప్రభాస్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకులు ఎవరూ లేరు అని చెప్పాలి. ‘సాహో’ సినిమా తీసిన సుజీత్‌ ఒక్కరే బెటర్‌. మిగిలిన రాధకృష్ణ, ఓం రౌత్‌ సరిగ్గా ప్రభాస్‌ను మాస్‌ మేనియాను చూపించలేకపోయారు. మరిప్పుడు సందీప్‌ రెడ్డి వంగా ఏం చేస్తారో చూడాలి. ఇక ‘సలార్‌’ సినిమాలతో ప్రశాంత్‌ నీల్‌ మాస్‌ ఫెస్టివల్‌ చూపిస్తాడు అని కచ్చితంగా చెప్పేయొచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus