Prabhas: ఎవరైనా తప్పు చేస్తే ప్రభాస్ అలా రియాక్ట్ అవుతారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఎప్పుడూ కూల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కు కోపం ఎక్కువని ఎవరైనా చెప్పినా ఆయన ఫ్యాన్స్ అస్సలు నమ్మరనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సన్నిహితులలో ఒకరైన ప్రభాస్ శ్రీను తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభాస్ కోపం వయిలెంట్ గా ఉంటుందని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. ప్రభాస్ కోపం ఇన్సులిన్ లాంటిదని నరాల్లోకి వెళ్లిపోతుందని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.

మన వల్ల ప్రభాస్ కు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయన మాట్లాడరని ప్రభాస్ శ్రీను తెలిపారు. ప్రభాస్ మనతో మాట్లాడని పక్షంలో అంతకు మించి మరో శిక్ష ఉండదని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. రోజూ అన్నం పెట్టే అమ్మ మాట్లాడకుండా ప్లేట్ ముందు పెడితే ఎలా ఉంటుందని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. ప్రభాస్ చాలా చాలా అవకాశాలు ఇచ్చి అప్పటికీ ఫలితం లేకపోతే మాత్రమే సీరియస్ అవుతారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.

తనకు ఏ విషయంలో కోపం కలుగుతుందో మాటల్లో ఎప్పుడో ఒకసారి ప్రభాస్ చెబుతారని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. ఆయన మాట వినకుండా ఓవర్ ఫ్లోలో వెళ్లిపోతే మాత్రం ప్రభాస్ కోపం చూస్తామని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ దగ్గర ఏ కాంప్లికేషన్స్ ఉండవు అని ఆయన తెలిపారు. ప్రభాస్ గారు అంత ప్రేమిస్తారు కాబట్టి ఆయన గిల్ట్ ను తీసుకోలేమని ప్రభాస్ శ్రీను అన్నారు.

ప్రభాస్ గారి వల్లే దర్శకుల నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. అమ్మ, నాన్న తర్వాత నాకు ప్రభాస్ మాత్రమేనని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. ప్రభాస్ గురించి ప్రభాస్ శ్రీను చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus