బిజినెస్ మొదలెట్టిన ప్రభాస్!
- September 7, 2017 / 02:11 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంటి హీరోలు ఇటు చిత్ర రంగంలో ఉంటూనే కొన్ని వ్యాపారాలను నిర్వర్తిస్తున్నారు. హీరోలుగా, నిర్మాతలుగా, వ్యాపారవేత్తలుగా విజయం సాధిస్తున్నారు. వీరిబాటలోనే ప్రభాస్ అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది వ్యాపారంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలాన్ని ప్రభాస్ కొన్నట్లు తెలిసింది. ఇక్కడ ఎంటర్టెన్మెంట్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం 40 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
ఈ స్థలంలో మూడు థియేటర్ల మల్టీ ఫ్లెక్స్ కాంప్లెక్స్, రెస్టారెంట్లు, చిన్న పిల్లలు ఆడుకునే థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. మరో విశేషం ఏమిటంటే.. దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి 106 అడుగుల భారీ త్రీడీ స్క్రీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు టాక్. ఒకేసారి 670 మంది కూర్చుని సినిమా చూసేలా డిజైన్ చేయబోతున్నారంట. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ తనకి అత్యంత సన్నిహితులకు ఎంటర్టెన్మెంట్ హబ్ పనులను అప్పగించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















