Prabhas: ఓరమాక్స్ సర్వేలో ప్రభాస్ హవా.. అతనే టాప్ అంటూ?

ప్రతి నెలా ఓరమాక్స్ సర్వేకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి. ఈ ఫలితాల విషయంలో ప్రేక్షకులలో భిన్నభిప్రాయాలు ఉన్నా ఈ ఫలితాల గురించి అభిమానుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల సర్వేకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ జాబితాలో స్టార్ హీరో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ప్రభాస్ వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

తారక్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. మరో స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ప్రిన్స్ మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవగా మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. వరుస విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.

పవన్ ప్రస్తుతం వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఈ జాబితాలో నాని ఏడో స్థానంలో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. చిరంజీవి సైతం వరుస విజయాలతో జోరుమీదున్నారు. మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా నందమూరి బాలకృష్ణ పదో స్థానంలో నిలిచారు. బాలయ్యకు తొలిసారి ఈ జాబితాలో ఛాన్స్ దక్కడం గమనార్హం.

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ స్థానాన్ని బాలయ్య సొంతం చేసుకున్నారు. బాలయ్య ఇకపై కూడా టాప్ 10లో నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus