టాలీవుడ్‌లో ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే టైమ్‌లో లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా తన మేకింగ్‌తో నేషనల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని రెబల్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కానీ వీరిద్దరి బిజీ షెడ్యూల్స్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.
Prabhas
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా (RC17) పనులు ఇప్పటికే మొదలైపోయాయి. దీని తర్వాత వెంటనే అల్లు అర్జున్‌తో పుష్ప 3 కూడా లైన్లో ఉంది. ఈ రెండు భారీ చిత్రాలను పూర్తి చేయడానికి సుకుమార్‌కు కనీసం మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఆయన మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు.
మరోవైపు ప్రభాస్ డైరీ కూడా అస్సలు ఖాళీ లేదు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇవి కాకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్కి 2, సలార్ 2లకు కూడా ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రాలన్నీ కంప్లీట్ అయ్యేలోపు సుకుమార్ ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలు కలవడానికి ఎక్కడా గ్యాప్ దొరకడం లేదు.
అసలు వీరిద్దరి మధ్య సినిమా గురించి వస్తున్న వార్తల్లో కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఇప్పటివరకు వీరి మధ్య ఎలాంటి అఫీషియల్ మీటింగ్స్ జరగలేదని సమాచారం. కేవలం అప్పుడప్పుడు కలిసినప్పుడు మాత్రం ఒకరితో ఒకరు పని చేయాలనే ఇంట్రెస్ట్ చూపించారట. అంతకు మించి కథా చర్చలు లేదా అగ్రిమెంట్లు ఏవీ జరగలేదని తెలుస్తోంది. సుకుమార్ తన సినిమాలను చాలా డీటెయిల్డ్‌గా ప్లాన్ చేస్తారు, ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం కూడా ఇప్పుడు పెద్ద టాస్క్. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ ఇద్దరి కాంబోలో సినిమా చూడాలనే ఫ్యాన్స్ కోరిక తీరాలంటే కనీసం 2029 లేదా 2030 వరకు ఆగక తప్పదు.