Prabhas, Anushka: ప్రభాస్.. అనుష్కకు సర్ ప్రైజ్ ఇచ్చాడా?

ప్రభాస్(Prabhas), అనుష్క (Anushka Shetty) కాంబినేషన్ గురించి టాలీవుడ్ ఫ్యాన్స్ కి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ జంట కలిసి చేసిన ‘మిర్చి’ (Mirchi) ‘బాహుబలి’ (Baahubali)  చిత్రాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో వీరి రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఈ ఇద్దరి మధ్య గల స్నేహం గురించి కూడా అందరూ అభినందిస్తారు. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈ ఇద్దరు మళ్లీ ఒకే సినిమాలో కనిపించాలి అని ఆశపడుతున్నారు.

Prabhas, Anushka

ప్రస్తుతం ప్రభాస్, అనుష్క ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ‘రాజా సాబ్(The Rajasaab),’ ‘స్పిరిట్(Spirit),’ ‘పౌజి’ లాంటి భారీ ప్రాజెక్టులతో హ్యాట్రిక్ హిట్ కోసమని పోరాటం చేస్తున్నారు. మరోవైపు, అనుష్క తన కొత్త చిత్రం ‘ఘాటీ’లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ అనుష్క తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తాజాగా వచ్చిన ఒక టాక్ ప్రకారం, ప్రభాస్ ఇటీవల అనుష్క నటిస్తున్న ‘ఘాటీ’ సినిమా సెట్ లో హఠాత్తుగా కనిపించి ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చాడట. ఆ సమయంలో అనుష్క కూడా ప్రభాస్ అకస్మాత్తుగా రావడం చూసి ఆశ్చర్యపోయిందని తెలుస్తోంది. ఈ ఇద్దరు సెట్‌లో స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ప్రశంసించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సర్ ప్రైజ్ విసిట్ గురించి ఎక్కువ సమాచారాన్ని బయటకు రానివ్వకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్, అనుష్క ఇద్దరూ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలుసు. ఇంతకు మునుపు కూడా వీరి స్నేహంపై ఎన్నో రకాల గాసిప్స్ పుట్టుకొచ్చినా, వీరు వాటిని పట్టించుకోలేదు. స్నేహ బంధం మధ్యే మంచి సహజమైన అనుబంధం కొనసాగిస్తుండటంతో వీరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అనుష్క ‘ఘాటీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రభాస్ ‘రాజా సాబ్’ ఏప్రిల్ 2025లో విడుదల కానుంది. అలాగే ‘కల్కి’ (Kalki 2898 AD) .

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus