The RajaSaab: ‘ది రాజాసాబ్’ విషయంలో ప్రభాస్ బాధ్యత ఎంత వరకు?
- January 24, 2026 / 11:14 AM ISTByPhani Kumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్'(The RajaSaab). సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. కలెక్షన్స్ సంగతి అటుంచితే… ఈ సినిమా ఔట్పుట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతృప్తి చెందలేదు. దర్శకుడు మారుతీ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ… సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేయలేక విఫలమయ్యాడు.
The RajaSaab
అయితే ‘ది రాజాసాబ్’ గురించి రిలీజ్ కి ముందు మారుతీ కానీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కానీ.. చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. మారుతీ అయితే ఇంటి అడ్రెస్ పెట్టి ఛాలెంజ్ విసిరాడు. సినిమా ఏమాత్రం డిజప్పాయింట్ చేసినా.. నా ఇంటికి రమ్మని సవాలు విసిరాడు. అతని ఫ్లాట్ వద్ద అభిమానులు చేస్తున్న నిరసన గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఊర్ల నుండి హైదరాబాద్ కి తిరిగెళ్లిన ప్రభాస్ అభిమానులు.. మారుతీ ఇంటికి ఫుడ్ ఆర్డర్లు వంటివి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్ తో పెట్టి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సరే ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఎంత వరకు బాధ్యత తీసుకోవాలి.? ఈ సినిమా కోసం ప్రభాస్ 45 రోజులు డేట్స్ ఇచ్చాడు. మొదట అనుకున్న స్కిప్ట్ ప్రకారం.. ఆ డేట్స్ సరిపోతాయి. కానీ తర్వాత దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్, వర్కింగ్ డేస్ పెరిగిపోయాయి. వీఎఫ్ఎక్స్ కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారు. ప్రభాస్ కూడా తన బిజీ షెడ్యూల్లో అదనంగా డేట్స్ ఇచ్చాడు.
ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.100 కోట్లు పారితోషికం అందుకున్నట్టు అంతా చెబుతున్నారు. కానీ వాస్తవానికి ‘ఆదిపురుష్’ వల్ల నిర్మాతలకు నష్టం వచ్చింది. దాన్ని అడ్వాన్స్ గా భావించి రూ.60 కోట్లు మాత్రమే ప్రభాస్ ఈ సినిమాకి పారితోషికం తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ కొంతమంది పనిగట్టుకుని ప్రభాస్.. ‘ది రాజాసాబ్’ సరైన విధంగా డేట్స్ ఇవ్వకపోవడం వల్ల కంటెంట్ బాగా రాలేదు అంటున్నారు.కానీ వాస్తవం ఇది.
అయినప్పటికీ నిర్మాతని ఆదుకోవాల్సిన భాద్యత ప్రభాస్ పై ఉంది కాబట్టి.. ‘స్పిరిట్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఇప్పించడం, అలాగే మరో సినిమా చేసి పెడతాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ప్రభాస్ ను ట్రోల్ చేస్తున్న వాళ్ళు గ్రహించాల్సి ఉంది.















