టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ 80 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే అయోధ్యకు ప్రభాస్ భారీ విరాళం ఇచ్చారని ఆ మొత్తం ఏకంగా 50 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల గురించి ప్రభాస్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని ఆ వార్తలను నమ్మవద్దని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. ప్రభాస్ టీమ్ క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ కు అయోధ్యలోని రామ మందిరానికి ఆహ్వానం అందడం వల్లే ఈ తరహా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ప్రభాస్ కల్కి, రాజాసాబ్ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. కల్కి, రాజాసాబ్ సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.
ప్రభాస్ (Prabhas) సినిమాలు భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న ప్రభాస్ కలెక్షన్ల విషయంలో సత్తా చాటుతున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతోంది. ప్రభాస్ త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. సలార్2 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.