Prabhas, Hanu Raghavapudi: ప్రభాస్‌ కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్‌.. ఎప్పుడు కొబ్బరికాయ కొడతారంటే?

‘సలార్‌’ (Salaar)  , ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అంటూ వరుస బ్లాక్‌బస్టర్లతో జోరు మీదున్నాడు ప్రభాస్‌ (Prabhas). వచ్చే సమ్మర్‌లో ‘రాజాసాబ్‌’ (The Rajasaab) వచ్చి భయపెట్టి, అలరించి, నవ్వించబోతున్నాడు కూడా. ఈ క్రమంలో ప్రభాస్‌ నెక్స్ట్‌ సినిమాను కూడా స్టార్ట్‌ చేసేస్తారు అని సమాచారం. ‘సలార్‌’, ‘కల్కి’ సీక్వెల్స్‌ ఇంకా చేయాల్సి ఉన్నా.. ఈ లోపు కొత్త సినిమా మొదలుపెట్టేద్దాం అని ప్లాన్‌ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలో ప్రారంభం ఉంటుంది అంటున్నారు.

మనసులను హత్తుకునే ప్రేమ కథలు తెరకెక్కించడంలో ఆరితేరిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో ప్రభాస్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 17న పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత వారం రోజులకు సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారట. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తాడట.

ఇండియా – పాకిస్థాన్‌ సరిహద్దు నేపథ్యంలో ఎక్కువ శాతం సన్నివేశాలు ఉంటాయి అంటున్నారు. ఈ క్రమంలో పాకిస్తానీ నటిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్రలో ‘సీతా రామం’ (Sita Ramam)  బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌నే (Mrunal Thakur)  ఎంచుకున్నారని టాక్‌. ఆమె అయితే భలేగా సరిపోతుందని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడనే మాట కూడా వినిపపిస్తోంది. పూజారి తనయుడిగా ప్రభాస్‌ కనిపిస్తాడని, రజాకార్ల నేపథ్యంలో సినిమా ఉంటుందని కూడా చెబుతున్నారు.

మరి వీటిలో ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటి గురించి ఈ రెండు వారాల్లో చాలా వార్తలు వస్తాయి. ఇక ప్రభాస్‌ ‘సలార్‌ 2’ సినిమా పనులు ఇప్పటికే స్టార్ట్‌ చేయాలి. కానీ ఎందుకో అవ్వలేదు. ‘కల్కి’ సీక్వెల్‌ పనులు ఎప్పుడు స్టార్ట్‌ అవుతాయనే విషయంలో స్పష్టత లేదు. ఈ లోపు ‘రాజా సాబ్‌’ పూర్తి చేసి.. హను సినిమా కూడా చేసేయాలి అనుకుంటున్నాడట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus