Prabhas: ప్రభాస్ కొత్త లుక్ కోసం ఎలా సిద్ధమవుతున్నాడంటే?

ప్రభాస్ (Prabhas)  ప్రస్తుతం మారుతి  (Maruthi Dasari) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి  (Hanu Raghavapudi) డైరెక్షన్ లో రూపొందుతున్న ‘ఫౌజీ’ ప్రాజెక్ట్ కూడా చేతిలో ఉంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల తమిళనాడులో మొదలైంది. అయితే ప్రభాస్ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు, 2025లో ఆరంభంలోనే ప్రభాస్ జాయిన్ అవుతారని సమాచారం. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ మాత్రం ‘స్పిరిట్’   (Spirit) పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.

Prabhas

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy), యానిమల్ (Animal) లాంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తనదైన శైలిలో ఎమోషనల్ పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ చూపించాడు. అందువల్ల ‘స్పిరిట్’ లో ప్రభాస్ ని ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన పాత్ర విషయంలో చాలా హార్డ్ వర్క్ చేయనున్నాడు. ప్రత్యేకంగా ఫిట్‌నెస్ పై కృషి చేస్తున్నారట. కండలు తిరిగిన, పవర్ ఫుల్ లుక్ కోసం ప్రభాస్ ఇప్పటికే వర్క్ అవుట్స్ మొదలుపెట్టినట్లు సమాచారం.

ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇస్తూ, స్క్రిప్ట్ ప్రెజెంటేషన్ లో సందీప్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారట. సందీప్ కూడా ప్రభాస్ ని ఓ కొత్త కోణంలో చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికి ఈ సినిమా కోసం క్యాస్టింగ్ పై కూడా పని చేస్తున్నారు. 2025 జనవరి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

‘స్పిరిట్’ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం లో ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) మరియు ‘సలార్ 2’ (Salaar) ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ 500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తోంది. 2027లో ‘స్పిరిట్’ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

బ్లాక్‌బస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్‌.. లక్కీ ప్రొడోన్‌ హౌస్‌లో ఆ కాంబో మళ్లీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus