బ్లాక్‌బస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్‌.. లక్కీ ప్రొడోన్‌ హౌస్‌లో ఆ కాంబో మళ్లీ!

కెరీర్‌ ప్రారంభంలో ఒకసారి కలసి నటించిన జోడీ (Blockbuster Combo ) .. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిశారు. అప్పుడు అందుకున్న విజయానికి మించి ఈ సారి అందుకున్నారు. ఆ విజయం ఇచ్చిన కిక్‌తో మరోసారి కాంబినేషన్‌ను సెట్‌ చేసే పనిలో ఉన్నారు అని తెలుస్తోంది. ఆ జోడీనే దుల్కర్‌ సల్మాన్‌  (Dulquer Salmaan) – సాయిపల్లవి (Sai Pallavi) . ఇటీవల ‘అమరన్‌’ (Amaran)  సినిమాతో బాక్సాఫీసు దగ్గరకు వచ్చిన మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ కలుస్తారట. వరుస విజయాలతో యంగ్‌ స్టార్‌గా వెలుగొందిన దుల్కర్‌ సల్మాన్‌కు గతేడాది ఏమంత మంచిగా లేదు.

Blockbuster Combo

అయితే ఈ ఏడాది వరస విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలో దీపావళికి వచ్చిన ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) కూడా భారీ విజయం అందుకుంది. అందులో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవిని ఆయన కొత్త సినిమాకు కాస్టింగ్‌లోకి తీసుకుందామని అనుకుంటున్నారట. దుల్కర్‌ తర్వాతి సినిమాల్లో ‘ఆకాశంలో ఒక తార’ ఒకటి. పవన్‌ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, లైట్‌ బాక్స్‌ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలోనే దుల్కర్‌కు జోడీగా సాయిపల్లవి కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుంది అని చెబుతున్నారు. దుల్కర్‌ – సాయిపల్లవి గతంలో అంటే 8 ఏళ్ల క్రితం ‘కలి’ అనే మలయాళ సినిమాలో జంటగా కనిపించి మెప్పించారు. ఇప్పుడుడ ఈ సినిమా ఓకే అయితే కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ అవుతుంది. ఇప్పటికే ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు సంబంధించి సాయి పల్లవితో కథా చర్చలు జరిగాయట.

ఆమెకు స్క్రిప్ట్‌ కూడా నచ్చడంతో సానుకూలంగానే ఉంది అని అంటున్నారు. ఇక సాయిపల్లవి సినిమాల సంగతి చూస్తే.. తెలుగులో నాగచైతన్యతో (Naga Chaitanya)  ‘తండేల్‌’లో (Thandel) నటసి్తోంది. హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor)  – యశ్‌  (Yash)  ‘రామాయణ్‌’లో సీత పాత్ర పోషిస్తోంది. దుల్కర్‌ సినిమాల విషయానికొస్తే.. ‘కాంతా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు ఆయన నిర్మాత కూడా.

నార్నే నితిన్ ఎంగేజ్మెంట్.. ఆ అమ్మాయి ఎవరంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus