Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగలనుందా..!

ఆదిపురుష్… ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభాస్ బాలీవుడ్ లో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. అలాగే ప్రభాస్ నటిస్తున్న మొదటి మైథలాజికల్ మూవీ కూడా. రామాయణంలోని మనకి తెలియని కోణాన్ని ఇందులో చూపించబోతున్నారు. రామాయణంలో సీతాదేవి పాత్రను మాత్రమే గొప్పగా చూపించారు.కానీ సీతా దేవి కంటే కూడా మండోదరి ఇంకా గొప్ప వ్యక్తి.. ఆమె రావణాసురుడి భార్య.

రాముడు అలియాస్ రఘురాం పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. సీతాదేవి అలియాస్ జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళ దాటినా, ఆ చిత్రానికి సంబంధించి ప్రభాస్ పార్ట్ కంప్లీట్ అయినా ..ప్రభాస్ లుక్ కు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.అయితే అక్టోబర్ 2 న టీజర్ రిలీజ్ అవుతుంది అనే ప్రచారం మొదలవ్వగానే ప్రభాస్ అభిమానుల్లో కొంత ఉత్సాహం నెలకొంది.

అసలే ఇటీవల కృష్ణంరాజు గారు మరణించడంతో ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు వారు కూడా హర్ట్ అయ్యారు. అయితే అయోధ్యలో టీజర్ లాంచ్ జరుగుతుంది అని తెలియగానే అంతా ఆనందించారు. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటి అంటే ఆదిపురుష్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ రివీల్ చేయరని ప్రచారం జరుగుతుంది. అది కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు అనే చెప్పాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus