అలాంటి లుక్ లో ప్రభాస్.. సంతోషంలో ఫ్యాన్స్..?

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ మాస్ సినిమాల్లో ఎక్కువగా నటించి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి, బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ల తర్వాత పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఒకవైపు సలార్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ మరోవైపు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. రాముడి పాత్రలో కనిపించడం కోసం ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ముంబైలో ఆదిపురుష్ మూవీ షూటింగ్ జరగనుండగా ఈ పాత్రలో స్లిమ్ లుక్ లో కనిపించడం కోసం ప్రభాస్ భారీగా బరువు తగ్గనున్నారని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జమ్ లో వర్కౌట్లు చేస్తూ ప్రభాస్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు. 2022 సంవత్సరం ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా ఈ సినిమాపై తెలుగు, హిందీ, ఇతర భాషల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దాదాపు 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ప్రభాస్ సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. బాహుబలి, బాహుబలి 2 సినిమాలలా ప్రభాస్ నటించబోయే ఒకటి, రెండు సినిమాలు హిట్టైతే మాత్రం ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. త్వరలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరగనుందని సమాచారం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus