Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ టాప్‌ రికార్డులు.. ఇంకా ఎన్ని వస్తాయో?

  • July 2, 2024 / 02:05 PM IST

ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌  (Prabhas)  – నాగ్‌ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్‌లో వైజయంతి మూవీస్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) . ఏంటీ ఇంత సాఫ్ట్‌గా ఇంట్రడక్షన్‌ ఇచ్చారు అనుకుంటున్నారా? అసలు ఎలివేషన్లు, మజా, ఘనతలు కింద ఉన్నాయి కాబట్టి కాస్త స్లోగా మొదలుపెట్టాం లెండి. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన రికార్డులు, సాధించిన ఘనతలు గురించి చెప్పడమే ఈ వార్త ఉద్దేశం. అయితే ఇవి ఇప్పటివరకే అనే విషయం మరచిపోవద్దు.

‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.555 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి సినిమా నిలిచింది కూడా. ఒక వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ఇప్పటివరకు షా రుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ‘జవాన్‌’ (Jawan). రూ.520.79 కోట్లు ఈ సినిమా వసూళ్లు. ఇప్పుడు కల్కి దాటేసింది. ప్రపంచ బాక్సాఫీసు దగ్గర కూడా ‘కల్కి’ ఆట సాగుతోంది.

మన దేఅంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి సినిమా ‘కల్కి’. తేజ సజ్జా (Teja Sajja) – ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ‘హను – మాన్‌’ (Hanu Man) సినిమా ఫుల్‌ రన్‌లో రూ.350 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిదే. ఈ ఏడాదిలో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 3 సినిమాల్లో ‘కల్కి’ ఉంది. మిగిలిన రెండు సినిమాలు ‘ఆర్‌ఆర్ఆర్‌’ (రూ.223 కోట్లు) (RRR) , ‘బాహుబలి 2’(Baahubali2) (రూ.217 కోట్లు).

‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’, ‘ఏ క్వైట్‌ ప్లేస్‌: డే 1’ సినిమాలకు దీటుగా వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ ఇంగ్లిష్‌ సినిమా బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇక ‘ఏ క్వైట్‌ ప్లేస్‌: డే 1’ 98.5 మిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోగా, ‘కల్కి 2898 ఏడీ’ 66 మిలియన్‌ డాలర్లు రాబట్టిందట.

మలేషియాలో ‘సలార్‌’ (Salaar) సినిమా పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును ‘కల్కి 2898 ఏడీ’ తమిళ సినిమా అధిగమించింది. మూడు రోజుల్లో రూ.2.2 కోట్లు వసూలు చేసింది. జర్మనీలో 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా ‘కల్కి’ నిలిచింది. తొలి వీకెండ్‌లో రూ.2.25 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘సలార్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘కేజీయఫ్‌ 2’ (KGF 2) సినిమాల రికార్డులను దాటేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus