Kalki 2898 AD: ప్రభాస్ ఖాతాలో మరో సంచలన రికార్డ్.. అసలేం జరిగిందంటే?

స్టార్ హీరో ప్రభాస్  (Prabhas) ఖాతాలో ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డులు ఉన్నాయి. ప్రభాస్ సినిమా విడుదలైతే ఆ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెమ్యునరేషన్ పరంగా కూడా ప్రభాస్ టాప్ లో ఉండగా సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  క్రియేట్ చేసిన రికార్డులు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గ్లోబల్ ట్రెండింగ్ లో టాప్1 లో కల్కి మూవీ నిలవడం గమనార్హం.

Kalki 2898 AD

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా సత్తా చాటుతోంది. ఆగష్టు నెల 22వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో కల్కి (Kalki 2898 AD) హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న రోజు నుంచి అదరగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమాలలో కల్కి ఒకటిగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో రెండు వారాల్లో ఈ సినిమాకు ఏకంగా 7.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయని భోగట్టా.

విడుదలైన తొలి వారంలోనే కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) 2.6 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. నాన్ ఇంగ్లీష్ విభాగంలో కల్కి 2898 ఏడీ టాప్ లో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా సొంతం చేసుకున్న ఘనత ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. కల్కి మూవీ థియేటర్లలో ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అమితాబ్  (Amitabh Bachchan) , కమల్ (Kamal Haasan) , దీపిక (Deepika Padukone)  నటించిన ఈ మూవీ సీక్వెల్ కూడా కూడా త్వరలోనే మొదలుకానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కల్కి సీక్వెల్ 2028 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. కల్కి సీక్వెల్ బడ్జెట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కల్కి సీక్వెల్ సైతం కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ద్వారా ప్రేక్షకుల మదిలో నెలకొన్న ఎన్నో సందేహాలకు సెకండ్ పార్ట్ చెక్ పెట్టనుందని చెప్పవచ్చు. కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ బాబు నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ సైతం రీరిలీజ్ కానుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus