Prakash Raj, Manchu Vishnu: ‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు..’ మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ ఫైర్!

ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ ఇటీవల ప్రకాష్ రాజ్ ని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. తాను చెప్పని మాటలను చెప్పానని.. నరేష్ అబద్దాలు ఆడుతున్నారని, ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడడం నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ అన్నారు. తన గురించి ఏదొకటి చెప్పాలని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో దిగాలి కానీ కృష్ణుడినవుతా.. రథం ఎక్కుతా.. ఈ మాటలెందుకు అంటూ నరేష్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.

అలానే మంచు విష్ణుపై కూడా ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. ‘మీరు పవన్‌కల్యాణ్‌ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా..?’ అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని అన్నారు. ‘వన్‌కల్యాణ్‌ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట ఆయన సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు’ అని అన్నారు ప్రకాష్ రాజ్. విష్ణు మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మార్నింగ్‌ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్‌.. ఎవరి గురించైనా మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

‘మీకు పొలిటికల్ ఎజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్ సినీ నటుడు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు.. నాకు ఏపీ రాజకీయాలు గురించి తెలియవు. ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు, ప్రశ్నలు అడిగారు. వాటి గురించి చర్చించుకుందాం’ అన్నారు ప్రకాష్ రాజ్. ‘మీరు పవన్‌కల్యాణ్‌ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా..?’ అంటూ నన్నెందుకు లాగుతున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ‘మా’ ఎలెక్షన్స్ లోకి జగన్ ని కూడా లాగడం కరెక్ట్ కాదని.. ‘మా’ అసోసియేషన్ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదని అన్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus