కర్ణుడి మరణానికి వంద కారణాలు అన్నట్లు.. ప్రతి ఎలక్షన్స్ లో ప్రత్యర్ధుల ఓటమికి చాలా కారణాలుంటాయి. అయితే.. నిన్న ముగిసిన మా ఎలక్షన్స్ లో ప్రకాష్ ఘోర పరాభవానికి మాత్రం ముఖ్యకారణం నాగబాబు అనే చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అసలే లోకల్ – నాన్ లోకల్ సెంటిమెంట్ బాగా వర్కవుటవుతున్న తరుణంలో.. నాగబాబు పనిగట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టడం, టీవీ చానల్స్ కి అనవసరమైన బైట్స్ ఇవ్వడం మొదలెట్టాడు. ఇస్తే ఇచ్చాడు కానీ.. సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు గురించి చాలా తప్పుగా మాట్లాడారు.
అనునిత్యం తెలుగు నటీనటుల మంచి కోసం పాటుపడే వ్యక్తుల్లో కోటా ఒకరు. ఆయన అనుభవంలో సగం కూడా లేని నాగబాబు.. ఆయన గూర్చి మాట్లాడుతూ “రేపో మాపో పోయేలా ఉన్న” అని కోటా గురించి ఎద్దేవా చేయడం అనేది క్షమించరాని నేరం. ఈ విషయం మా ఆర్టిస్టులకు కూడా నచ్చలేదు. అందుకే 200 ఓట్ల భారీ మెజారటీతో మంచు విష్ణును గెలిపించారు. ప్రకాష్ ఓటమికి బాధ్యత వహిస్తూ నాగబాబు మా అసోసియేషన్ మెంబర్ షిప్ కు సైతం రాజీనామా చేశారు.
అప్పుడు నోరుజారి ఇప్పుడు అసోసియేషన్ నుంచి తప్పుకోవడం అనేది స్వాగతించదగిన విషయం కాదు. ఇప్పటికైనా నాగబాబు మాట అదుపులో పెట్టుకొంటే మంచిది.. లేదంటే మా కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు నుంచి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు