అవును… ప్రకాశ్‌రాజ్ మౌనవ్రతం తీసుకున్నారు. ఎందుకు ఏమైంది, ఏ విషయంలో లాంటి ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నారా? ఈలోపు మేమే చెప్పేస్తాం. ప్రకాశ్‌రాజ్ గత కొద్ది రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారట. దీంతో ఇటీవల కంప్లీట్ హెల్త్ చెకప్ కోసం వైదుల్ని సంప్రదించారట. ఆ క్రమంలో గొంతు సమస్య బయటపడిందట. దీంతోనే మౌనవ్రతం తీసుకోవాల్సి వస్తోందట. స్వరపేటిక కాస్త ఇబ్బంది పెడుతుండటంతో వైద్యులు కొద్ది రోజులు రెస్ట్ అవసరమని చెప్పారట. మనిషికే కాదు, నోటికి కూడా రెస్ట్ ఉండాలని వైద్యులు తెలిపారట.
దీంతో వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్ నిర్ణయించారు. దీంతోపాటు వారంపాటు ఆయన మాట్లాడకుండా ఉండాలట. అలా ఆయన మౌనవ్రతం చేస్తున్నట్లు లెక్క. నటులు కదా వరుస సినిమాలు, డబ్బింగ్‌లు చెప్పడం వల్ల ఇలా స్వరపేటిక ఇబ్బంది పెడుతుంటుంది. గతంలోనూ కొంతమంది నటులు ఇలా స్వరపేటిక ఇబ్బంది పెట్టి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ కూడా అదే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రకాశ్‌రాజ్ ఇటీవల.. ‘జై భీమ్’, ‘ఎనిమీ’, ‘పెద్దన్న’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరికొన్ని సినిమాలు వరుసలో ఉన్నాయి. మౌనవ్రతంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లే మరి.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!