Pranitha Subhash: అద్దంలో తన బేబీ బంప్ చూసుకుంటూ మురిసిపోతున్న ప్రణీత..!

ఇటీవల ప్రణీత భర్త నితిన్ రాజు పుట్టినరోజు కావడంతో అతని పుట్టినరోజు నాడే తన ప్రేక్షకులకి మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రణీత. ‘తన భర్త 34 వ పుట్టినరోజు నాడు ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు తెలిపింది. ‘నా భర్త 34వ పుట్టినరోజు నాడు దేవతలు మాకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ను ఆశీర్వదించారు. ఇచ్చి మాకు నిజంగానే పెద్ద సర్ప్రైజ్’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది.

Click Here To Watch Trailer

అంతేకాదు తన భర్తతో ఆ ఆనందాన్ని పంచుకుంటూ దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. తాజాగా మరో ఫోటోని కూడా షేర్ చేసింది ప్రణీత. ఈ ఫోటోలో తన బేబీ బంప్ ను చూసుకుంటూ ఆమె మురిసిపోతుంది. ‘మహిళలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని తెలిసినప్పటి నుండీ ప్రతీసారి తమ పొట్టను తనిఖీ చేసుకుంటూ ఉంటారు’ అంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

”ఏం పిల్లో ఏం పిల్లడో’,’బావ’ ‘అత్తారింటికి దారేది’ .. వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రణీత అటు తర్వాత కోలీవుడ్, బాలీవుడ్లో కూడా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళకపోయినా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. లాక్ డౌన్ టైంలో ఈమె చేసిన సేవా కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోలేరు. ఎంతో మందికి ఆకలి తీర్చి ఈమె రియల్ హీరోయిన్ అనిపించుకుంది.

ఇక 2021 ఏప్రిల్ లో ఈమె బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు ని పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus