Ravi Teja: రవితేజ పైనే ఆశలు పెట్టుకున్న ప్రసన్న.. కానీ..!

  • November 15, 2023 / 12:41 PM IST

టాలీవుడ్ స్టార్ రైటర్ గా పాపులర్ అయ్యాడు ప్రసన్నకుమార్ బెజవాడ. పలు హిట్ సినిమాల్లో ఇతని రైటింగ్ క్రెడిట్ చాలా ఉంది. దర్శకుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. నాగార్జున.. ప్రసన్న కుమార్ కి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో అది విజయ్ బిన్నీకి వెళ్ళింది. ‘నా సామి రంగ’ అనే టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది. 2023 సంక్రాంతికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రావాలి.

కానీ రాలేదు.ఆ సినిమా కోసం నాగ్ లుక్ కూడా మార్చుకున్నారు. ప్రీ ప్రొడక్షన్లో ఈ సినిమా బడ్జెట్ రూ.65 కోట్ల వరకు అవుతుంది అనే ఉద్దేశంతో ప్రసన్నని తప్పించి.. విజయ్ బిన్నీని తీసుకున్నట్లు కథనాలు వినిపించాయి. సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ప్రసన్న దారెటు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘ధమాకా’ వంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులో భాగం అయినందుకు ప్రసన్న పై రవితేజ దృష్టి పడింది.

అతనికి కూడా ప్రసన్న పలు కథలు వినిపించాడు. కానీ ఈలోపు కింగ్ నుండి పిలుపు రావడంతో ప్రసన్న.. ఇటు వచ్చాడు. రవితేజ వేరే ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రసన్న ఖాళీనే. ఈ మధ్య తరచూ రవితేజ వద్దకు వెళ్లి కలుస్తూ సినిమా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలో రవితేజ ‘ధమాకా’ ‘ఈగల్’ తో పాటు మరో సినిమా చేయాల్సి ఉంది.

అది హరీష్ శంకర్ తో అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రసన్న పేరు కూడా వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రసన్న డెబ్యూ.. (Ravi Teja) రవితేజతోనే..! లేదు అంటే.. ఇంకొన్నాళ్ళు ఆగాల్సి ఉంది. మరేమవుతుందో..!

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus