Prasanth Varma: ‘హనుమాన్‌’ క్రేజ్‌ వాడుకుని ప్రశాంత్‌ వర్మ ‘ఐదుగురు’ అదరగొడతారా?

దర్శకులు పెద్ద సినిమా ఒకటి చేస్తూనే… పారలల్‌గా చిన్న సినిమా చేస్తుండటం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందరూ చేస్తున్నారు అని అనం కానీ.. కొంతమంది యువ దర్శకులు అయితే ఇదే పనిలో ఉన్నారు. ఆ పెద్ద సినిమా ఏదో కారణాల వల్ల ముందుకు వెళ్లకపోవడమో, లేక టైమ్‌ దొరకడం లాంటివి దీనికి కారణం. ఇలాంటి దర్శకుల్లో ఒకరు ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) అయితే.. ఆ సినిమా ‘ఆక్టోపస్‌’ అని అంటున్నారు. ఇదేం సినిమా ‘హను – మాన్‌’ (HanuMan)   కదా ఆయన తీసింది అని అనొచ్చు. అయితే పైన చెప్పినట్లుగా పారలల్‌గా ఆయన ‘ఆక్టోపస్‌’ అనే సినిమా చేశారట.

‘హను – మాన్’ సినిమాతో స్టార్ దర్శకుడు అయిపోయారు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు ఆయన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఆయన నెక్స్ట్‌సినిమా ‘జై హనుమాన్‌’ గురించి ఇప్పటి నుండే చర్చ మొదలైంది. అయితే ఈ బజ్‌ను ఉపయోగించుకొని మరో సినిమాను ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఆయన. అదే ‘ఆక్టోపస్‌’. అలా అని ఆ సినిమా ఎప్పుడో చేసేసింది కాదు. రీసెంట్‌గానే మొదలైంది. దాదాపు చిత్రీకరణ చివరిదశకొచ్చిందట. ఇక్కడ విషయం ఏంటంటే ఆ సినిమా మల్టీస్టారర్‌. ఐదుగురు హీరోయిన్లు ఆ సినిమాలో నటిస్తున్నారట.

ఈ సినిమాకు ‘ఆక్టోపస్‌’ అనే పేరు పెట్టారట. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ (Anupama Parameswaran) ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి కాగా… మిగిలిన నలుగురు హీరోయిన్ల కాస్త పేరున్నవాళ్లనే తీసుకున్నారట. అయితే ఎవరా హీరోయిన్లు అనేది తెలియడం లేదు. మిగిలిన షూటింగ్‌ పార్ట్ కంప్లీట్ చేసి త్వరలో రిలీజ్ చేసే పనిలో ఉన్నారట ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రమని.. అందుకే రిలీజ్ కి ముందే చిత్రోత్స‌వాల‌కు పంపాల‌ని అనుకుంటునర్నారట. కచ్చితంగా ఈ సినిమా అవార్డ్స్ సాదిస్తుందని ఆయన నమ్మకమని చెబుతున్నారు.

ఇప్పటికే ‘హను – మాన్‌’తో ప్రజల మనుసులు గెలుచుకున్న ప్రశాంత్‌ వర్మ… ఇప్పుడు ‘ఆక్టోపస్‌’తో అవార్డులు గెలవాలని చూస్తున్నారు. అన్నట్లు ఆయన ఎక్కువమంది హీరోయిన్లను హ్యాండిల్‌ చేయడం మనం గతంలోనే చూశాం. నిత్య మీనన్‌, కాజల్‌, ఈషా రెబ్బా లాంటి వాళ్లతో ‘ఆ!’ సినిమా తీసింది ఈయనేనాగా.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus