Prasanth Varma, Balayya Babu: టాక్‌ షో టు టాకీస్‌ ఛాన్స్‌ కొట్టేస్తాడా!

నందమూరి అందగాడు… అని బాలకృష్ణను అందరూ మద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన్ను చూపించాల్సిన ఫ్రేమ్‌లో, చూపించాల్సిన స్టైల్‌లో చూపిస్తే ఫ్రేమ్‌ అదిరిపోతుంది అనేది అందరికీ తెలిసిందే. ఈ పల్స్‌ తెలిసిన దర్శకులు మన దగ్గర చాలా తక్కువమందే ఉన్నారు అంటుంటారు. అలాంటి దర్శకుల జాబితాలో ఓ కుర్ర దర్శకుడు చేరాడు. అవునా ఏ సినిమా వచ్చింది, ఎందులో అనుకోవద్దు. ఎందుకంటే అతను చేసింది సినిమా కాదు యాడ్‌. అవును ప్రకటనే.

‘ఆహా’ కోసం బాలకృష్ణ ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి సంబంధించి ఇటీవల ఓ ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో బాలకృష్ణ భలేగా కనిపించాడు. స్టైలిష్‌, లావిష్‌, మాస్‌, కూల్‌, ఎలిగెంట్‌… ఇలా ఎన్ని కావాలంటే అన్ని రకాల ఉపమానాలతో బాలయ్యను ఆ ప్రోమో చూసి పొగిడేయొచ్చు. బాలయ్యను అలా చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘ఆ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాలు చేసి, ఇప్పుడు ‘హను – మాన్‌’ తీస్తున్న దర్శకుడే.

బాలయ్యను ప్రశాంత్‌ వర్మ చూపించిన విధానం చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారట. ఇదే లుక్‌లో ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందితే అదిరిపోతుందనేది అభిమానుల ఆలోచన. కావాలంటే మీరూ ఓ సారి ఆ ట్రైలర్‌ చూడండి… మీకే అర్థమవుతుంది. ఓసారి ఊహించుకోండి… సినిమా ఎలా ఉండొచ్చు. అయితే ప్రశాంత్‌ వర్మ చేస్తున్న కాన్సెప్ట్‌లు ఇక్క వర్కవుట్‌ అవ్వవు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus