ఫస్ట్ ఫిలిం ‘అ!’ తోనే ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. యాడ్ ఫిలిం మేకర్‌గానూ సత్తా చాటిన ప్రశాంత్.. రాజ శేఖర్ లాంటి సీనియర్ యాక్టర్‌తో ‘కల్కి’ తీసి ఆకట్టుకున్నాడు.. తేజ సజ్జాను హీరోగా పెట్టి తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి జాంబీల బ్యాక్ డ్రాప్‌లో ‘జాంబి రెడ్డి’ తెరకెక్కించాడు.. ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద ఈ సృష్టిలోనే అత్యతం శక్తివంతమైన సూపర్ హీరో హనుమంతుడిని చూపించబోతున్నాడు..
తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా.. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న పాన్ ఇండియా ఫిలిం.. ‘హనుమాన్’.. ‘ది మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్’ అంటూ హనుమంతుడి శక్తిసామర్థ్యాల ఆధారంగా.. ఇతిహాసాల నేపథ్యాన్ని తీసుకుని శ్రీమతి చైతన్య సమర్పణలో.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ‘హనుమాన్’ టీజర్ రిలీజ్ చేయగా ఊహించని స్పందన వచ్చింది..
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావుతో సహా ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశాంత్ వర్మ టేకింగ్‌ని ప్రశంసించారు.. తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ రేంజ్ మేకింగ్‌తో, అత్యద్భుతమైన విజువల్స్‌తో ఆశ్చర్యపరిచాడు.. ఇప్పుడీ సినిమా స్థాయి మరింత పెరిగింది.. ఇప్పటివరకు ‘హనుమాన్’ పాన్ ఇండియా ఫిలిం అన్నారు కానీ దాన్ని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు ప్రశాంత్.. ‘హనుమాన్’ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చూపించాలని..
దీనితో రాజమౌళి తెలుగు సినిమాకి తీసుకొచ్చిన గుర్తింపుని కొనసాగిస్తాను అన్నట్టు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. ఇండియాతో పాటు యూఎస్ఏ, చైనా, జపాన్, యూకే, స్పెయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, మలేషియా వంటి దేశాల్లో.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ వంటి 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు.. ‘హనుమాన్’ మే 12న భారీస్థాయిలో విడుదల కానుంది..