Prashant Neel: కేజీఎఫ్3 విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇదే!

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు ఏ స్థాయిలో సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్3 సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా త్వరగానే మొదలవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ కేజీఎఫ్3 సినిమా తెరకెక్కించడం ఖచ్చితం అయితే కాదని తెలిపారు. కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో ప్రజలు ప్రేమలో పడ్డారని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు.

ఆ పాత్రను బాగా ఇష్టపడుతున్నారని ఆయన వెల్లడించారు. అందువల్ల కేజీఎఫ్3 సినిమా తీస్తామని ఆయన కామెంట్లు చేశారు. కేజీఎఫ్3 సినిమాలో ఏం జరగబోతుందో ఇప్పటికే తమ దగ్గర ఐడియా ఉందని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. కేజీఎఫ్2 సినిమా విడుదలకు ముందే తనకు ఈ ఐడియా వచ్చిందని ఆయన అన్నారు. కేజీఎఫ్3 సినిమా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాలేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సలార్ సినిమాను పూర్తి చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారు.

ఈ రెండు సినిమాలు పూర్తైతే మాత్రమే కేజీఎఫ్3 మూవీ తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ సినిమాలు తెరకెక్కనున్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రోజురోజుకు ప్రశాంత్ నీల్ కు క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సలార్ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి కాగా డిసెంబర్ నాటికి ఈ సినిమా షూట్ మొత్తం పూర్తవుతుందని బోగట్టా. భాషతో సంబంధం లేకుండా ప్రశాంత్ నీల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus