ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ రిలీజ్ కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది. అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాపై ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రశాంత్ వర్మ మహాభారతం సినిమాను తెరకెక్కిస్తే తాను ఏ హీరోను ఏ పాత్రను తీసుకుంటాననే విషయాలను చెప్పుకొచ్చారు. చిరంజీవి ధర్మరాజు పాత్రకు సూట్ అవుతారని,
రామ్ చరణ్ అర్జునుడి పాత్రకు సూట్ అవుతారని, భీముడి పాత్రకు తారక్, సహదేవుడి రోల్ కు విజయ్ దేవరకొండ, నకులుడి పాత్రకు నాని, కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్, కృష్ణుడు పాత్రకు మహేష్ బాబు, దుర్యోధనుడు పాత్రకు మోహన్ బాబు, ద్రౌపది రోల్ కు నయనతార సూట్ అవుతారని చెప్పుకొచ్చారు. మరి ప్రశాంత్ వర్మ (Prashant Varma) నిజంగానే మహాభారతం తీస్తారో లేదో చూడాలి. రాజమౌళి మహాభారతం సినిమాలో నటించడానికి మాత్రం చాలా మంది హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జక్కన్న చివరి ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహాభారతం ఎవరు తెరకెక్కించినా విమర్శలకు తావివ్వకుండా తెరకెక్కించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహాభారతం సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి నటిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మహాభారతం ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ దర్శకులు మహాభారతం తెరకెక్కిస్తే మాత్రం భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి రాబోయే రోజుల్లో మహాభారతం గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి భవిష్యత్తు క్రేజీ ప్రాజెక్ట్ లు మరింత మంచి పేరును తెచ్చిపెట్టాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!