Prashanth Neel: 20 ఏళ్లకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరబోతోంది: ప్రశాంత్ నీల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నటన పట్ల ఎన్టీఆర్ ఎలాంటి డెడికేషన్ చూపిస్తారో మనకు తెలిసిందే.ఇలా అద్భుతమైన నటుడితో సినిమా చేయాలని డైరెక్టర్లు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూసినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ తనతో చేయబోతున్న 31 వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ పవర్ ఫుల్ డైలాగ్ విడుదల చేశారు. ఈ పోస్టర్,డైలాగ్ చూస్తేనే ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. ఎన్టీఆర్ 31 తో తన కల నెరవేరబోతుందని ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల క్రితమే ఈ సినిమా గురించి ఆలోచనలు నాలో కలిగాయని ప్రశాంత్ నీల్ తెలిపారు.

ఇలా 20 ఏళ్ల కల నేడు తీరబోతోందంటూ ఆయన ఈ సినిమా గురించి సంతోషం వ్యక్తం చేశారు.కే జి ఎఫ్ వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. ఇకపోతే ఇది వరకు ఎన్నో ఇంటర్వ్యూలలో తాను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానని ప్రశాంత్ నీల్ ఎన్నోసార్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన అభిమాన హీరోతో సినిమా చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ 31వ సినిమాకి సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొరటాల శివ సినిమా అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus