Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పిన ప్రశాంత్ నీల్.. ఏం చెప్పారంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రభాస్ పైకి అమాయకంగా కనిపిస్తారని ఆయన అన్నారు.

అదే సమయంలో తనదైన నటనతో ప్రభాస్ దూకుడుని కూడా ప్రదర్శించగలరని ఆయన కామెంట్లు చేశారు. స్వచ్చమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రభాస్ వ్యక్తిత్వం పక్కాగా సరిపోతుందని ప్రశాంత్ నీల్ అన్నారు. ప్రభాస్ ఎంత పెద్ద నటుడో అంత సౌమ్యుడు అని ఆయన చెప్పుకొచ్చారు. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు.

సలార్ సినిమా రెండు భాగాల కథ అని సెట్స్ పైకి వెళ్లకముందే ఈ సినిమా రెండు భాగాలు అని ఫిక్స్ అయిందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ సినిమాను మొదట రెండు భాగాలుగా తీయాలని అనుకోలేదని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్లను అందుకున్నారని సమాచారం అందుతోంది.

డిసెంబర్ నెలలో రిలీజ్ కానున్న సినిమాలలో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధిస్తాయో చూడాల్సి ఉంది. సలార్ సినిమాలో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండగా ఈ సినిమా సక్సెస్ సాధించి కళ్లు చెదిరే లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus