Prashanth Neel,Prabhas: ప్రభాస్ ను భారీగా కష్ట పెడుతున్న ప్రశాంత్ నీల్!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ఇదివరకు నటించిన డార్లింగ్ మిర్చి మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలలో ఎంతో గ్లామర్ లుక్ లో కనిపించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ ఆ పాత్రకు అనుగుణంగా కరెక్ట్ గా సరిపోయారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రానికిగాను సిక్స్ ప్యాక్ ఉన్నప్పటికీ ఆయన మొహంలో అందం కోల్పోయారని వార్తలు వచ్చాయి,

ఇక రాధేశ్యామ్ విషయంలో కూడా ప్రభాస్ ఉన్నఫలంగా శరీర బరువు పెరగడమే కాకుండా తన ఫేస్ లో మునుపటి కల తప్పిపోయిందని అభిమానులు ప్రభాస్ లుక్ గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా కోసం ప్రభాస్ ఇలా అధికబరువుతో కాకుండా చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలని ప్రశాంత్ నీల్ కోరుకున్నారట. ప్రశాంత్ నీల్ ఊహించుకున్న లుక్ కనిపించాలంటే ప్రభాస్ తప్పనిసరిగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ శరీర బరువు తగ్గాలనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

Prashanth Neel

ఈ క్రమంలోనే ప్రభాస్ తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ప్రభాస్ అవుట్ ఫిట్ గురించి పలు విమర్శలు చేసిన వారి నోళ్లను సలార్ సినిమాతో మూయించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయాని కొస్తే ప్రస్తుతం 30 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

'KGF' director Prashanth Neel to direct Prabhas1

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలను ప్రశాంత్ చేరుకోగలరా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus