Prashanth Neel: సినిమాకు సినిమాకు లింక్‌.. నీల్‌ మామ వండర్‌ చేస్తారా!

హాలీవుడ్‌ సినిమాలు బాగా చూసేవారికి ‘మల్టీవర్స్‌’ అంటే ఏంటో బాగా తెలుస్తుంది. సూపర్‌ హీరో పాత్రలను ఒకదానికొకటి లింక్‌ పెట్టి.. మొత్తంగా ఓ యూనివర్స్‌లా చూపిస్తుంటారు. వారందరితో సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారా? అవుననే అంటున్నాయి శాండిల్‌ వుడ్‌ వర్గాలు. ఆయన వరుస సినిమాలు, వాటి పోస్టర్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది అని చెబుతున్నారు. దీనికి కారణం రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఎన్టీఆర్‌ సినిమా పోస్టరే అని చెబుతున్నారు.

తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో త్వరలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ను విడుదల చేశారు. డార్క్‌ బ్యాగ్రౌండ్‌ బొగ్గు రంగు ముఖంతో ఎన్టీఆర్‌ ఇంటెన్స్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి ప్రశాంత్‌ నీల్‌ సినిమాల లుక్‌లు అన్నీ అలానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు తారక్‌ లుక్‌ చూసి ప్రశాంత్‌ నీల్‌ తీసే సినిమాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. అంటే ఒక సినిమాలోని పాత్రతో మరో సినిమా చేస్తున్నారు అని చెబుతున్నారు.

‘కేజీయఫ్‌’, ‘సలార్‌’, ‘ఎన్టీఆర్‌ 31’ సినిమాల థీమ్‌ డార్క్‌ గ్రే కలర్‌లో ఉంది. హీరోలందరూ రఫ్‌లుక్‌లోనే కనిపిస్తున్నారు. ‘కేజీయఫ్‌’ గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యం అయితే, సలార్‌ ‘కోల్‌ మైనింగ్‌’ అని టాక్‌. మరి ఎన్టీఆర్‌ మూవీ నేపథ్యం కూడా దాదాపు అలానే ఉంటుందట. ‘కేజీయఫ్‌ 2’లో ఈశ్వరీరావు కుమారుడి పేరు ‘ఫర్మాన్‌’. రాఖీ భాయ్‌ దగ్గర పనిచేస్తూ అధీర చేతికి చిక్కుతాడు. అయితే, అతడిని చంపేశారా లేదా? అన్నది స్పష్టంగా చూపించలేదు. ఫర్మాన్‌ మెడలో ఉన్న లాకెట్‌ ‘సలార్‌’ పోస్టర్‌లో ప్రభాస్‌ మెడలో ఉన్న లాకెట్‌ ఒకేలా ఉన్నాయి అని అంటున్నారు.

దీంతో ‘కేజీయఫ్‌ 2’లో మాయమైన ఫర్మాన్‌ బతికే ఉన్నాడా? ‘సలార్‌’లో ప్రభాస్‌ పాత్ర అదేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు #ఎన్టీఆర్‌31లో తారక్‌ పాత్రను ‘సలార్‌’లో ఓ పాత్రకు కొనసాగింపుగా చూపిస్తారనే వాదనా వినిపిస్తోంది. అసలు ఈ మూడు సినిమాలకూ మధ్య సంబంధం ఉందా… అనేదే ఇప్పుడు ప్రశ్న. ‘కేజీయఫ్‌3’ సినిమా తీస్తామని ‘కేజీయఫ్‌ 2’ ఆఖరున చెప్పారు. మరి ఆ కథేంటి? అనేది చూడాలి. ఏదైనా నీల్‌ మామ (నెటిజన్లు అలానే పిలుస్తున్నారులెండి) చెప్పాల్సిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus