Prashanth Neel Remuneration: ‘కేజీఎఫ్’ డైరెక్టర్ కి డబుల్ పేమెంట్!

  • May 3, 2022 / 01:19 PM IST

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. అందులో రెండు సినిమాలు ‘కేజేఎఫ్’ ఫ్రాంచైజీనే. ఈ సినిమాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఓవర్సీస్ లో కూడా ‘కేజీఎఫ్’ సినిమా సత్తా చాటింది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రెండు టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నారు ప్రశాంత్ నీల్.

ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కూడా ‘కేజీఎఫ్’ సినిమాను నిర్మించిన హోంబేలె ఫిలిమ్స్ వారే నిర్మిస్తున్నారు. దీనికి ప్రశాంత్ నీల్ రూ.25 కోట్ల రెమ్యునరేషన్ కి ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్న కొత్త సినిమాలకు మాత్రం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు ప్రశాంత్ నీల్. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

అలానే డీవీవీ దానయ్యతో మరో సినిమా కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలకు ప్రశాంత్ నీల్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించారట. ‘కేజీఎఫ్’ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకున్నట్లు సమాచారం. మరిప్పుడు తెలుగు సినిమాలకు సంబంధించిన కూడా అలానే చేస్తారేమో చూడాలి. కానీ యాభై కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు ఇక లాభాల్లో వాటాలు ఇవ్వడానికి మన నిర్మాతలు ఒప్పుకోకపోవచ్చు. మరేం జరుగుతుందో చూడాలి. సౌత్ లో మాత్రం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ముందంజలో ఉన్నట్లే చెప్పాలి!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus