సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో హనుమాన్ సినిమా ఒకటి ఒక చిన్న సినిమాగా అత్యంత తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై ఎన్నో రకాలుగా ఒత్తిడి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని వాయిదా వేయాలి అంటూ మేకర్స్ కు భారీ స్థాయిలో ఒత్తిడి వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు అదే విధంగా థియేటర్లను కూడా చాలా తక్కువగా కేటాయించారు. ఇలా తక్కువ థియేటర్లు ఇచ్చినప్పటికీ కంటెంట్ పై ఉన్నటువంటి నమ్మకంతో చిత్ర బృందం ఈ సినిమాని పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పరోక్షంగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది కొంతమంది ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా పట్ల దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తమ సినిమా గురించి జరుగుతున్నటువంటి చెడు ప్రచారంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కొందరు హనుమాన్ టీమ్ పై దాడి చేస్తున్నారు. ఈ చెత్తను భోగి మంటల్లో కాల్చేయాలని ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతుంది.