Balayya Babu: బాలకృష్ణ కొత్త సినిమా ఆ యువ దర్శకుడితోనేనా..!

టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులుగా పేరుగాంచిన వాళ్లలో చాలామంది హీరోలకు యాడ్స్‌ చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే యువ దర్శకుల్లో ఇలా యాడ్స్‌ చేస్తున్న వారిలో ప్రశాంత్‌ వర్మ ముఖ్యులు అనొచ్చు. ఇటీవల కాలంలో ఆయన నుండి వరుస యాడ్స్‌ వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆహాకి సంబంధించిన యాడ్స్‌ ప్రశాంత్‌ వర్మ చేస్తున్నారు. తెలుగు టాక్‌ షోస్‌లో రీసెంట్‌ సెన్సేషన్‌ అయిన ‘అన్‌స్టాపబుల్‌’ యాడ్స్‌, ప్రోమోస్‌ ఆయన అధ్వర్యంలోనివే.

అయితే ఆ పరిచయంతో ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా ఛాన్స్‌ సంపాదించారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రశాంత్‌ వర్మ ప్రస్తుతం ‘హను మాన్‌’ అనే సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. తేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ వర్మ నిజానికి డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్‌ హీరోగా ఓ సినిమా చేయాలి. ‘అధీర’ పేరుతో ఆ మధ్య ఈ సినిమా ప్రారంభమైంది కూడా. అయితే ఆ సినిమా సంగతి తర్వాత ఎక్కడా వినిపించడం లేదు.

కానీ.. డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రశాంత్‌ వర్మ మరో సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా దానయ్య ఓ సినిమా నిర్మించాలని అనుకుంటున్నారట. దానికి ప్రశాంత్‌ వర్మ దర్శకుడు అని సమాచారం. గత కొన్ని రోజులుగా దీని మీదే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే.. బాలయ్యతో యాడ్‌ ఫిల్మ్స్‌ చేసి.. ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్‌ సంపాదించిన వ్యక్తి అవుతారు ప్రశాంత్‌ వర్మ. అయితే ఇప్పటికిప్పుడు ఈ సినిమా మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

‘వీర సింహా రెడ్డి’ సినిమా తర్వాత బాలయ్య అనిల్‌ రావిపూడి సినిమా చేస్తారు. దీనికి సంబంధించి కథ, కథనం, కాస్టింగ్‌ రెడీ అంటున్నారు. అయితే ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా ఉంటుంది అని వార్తలొచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఈ సినిమా మైలేజీ కలిసొస్తుందని అంటున్నారు. మరోవైపు బాలయ్యతో తన నెక్స్ట్‌ సినిమా ఉంటుందని ఇటీవల పరశురామ్‌ చెప్పారు. ఆ లెక్కన ప్రశాంత్‌ వర్మ సినిమా ఎప్పుడు అనేది చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus