రామ్ – ప్రవీణ్ సత్తారు ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కబోతుందట..!

ఎంత మంచి కథైనా సరే.. బడ్జెట్ లెక్కలు అలాగే హీరో మార్కెట్ మ్యాచ్ అయితేనే సెట్స్ పైకి వెళ్తుంది. ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రాన్ని తీసుకోండి. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిజానికి కొన్నేళ్ళ క్రితమే చెయ్యాలనుకున్నారు మెగాస్టార్. కానీ అప్పటికి తెలుగు సినిమాకి అంత మార్కెట్ లేదు. అందుకే దర్శకనిర్మాతలు ధైర్యం చెయ్యలేదు. కానీ ‘బాహుబలి'(సిరీస్)తో తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది కాబట్టి.. ధైర్యం చేసినట్టు చిరు .. ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు.ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం.

గతంలో రామ్ – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం అప్పుడు రామ్ మార్కెట్ రూ.20 కోట్లు. కానీ ఈ చిత్రానికి అయ్యే బడ్జెట్ రూ.60 కోట్లు నుండీ రూ.70కోట్లని భావించి నిర్మాత స్రవంతి రవికిశోర్ వెనకడుగు వేసారట. అయితే గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్.. తన మార్కెట్ ను 40కోట్లకు పెంచుకున్నాడు.అంటే రామ్ మార్కెట్ డబుల్ అయ్యిందన్న మాట.

అంతేకాదు ఇతని సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు భారీ రేట్లకు అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ప్రవీణ్ సత్తారు – రామ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన చిత్రాన్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలో పడ్డారట రవికిశోర్. చూడాలి మరి ఈ ప్రాజెక్టు ఎంతవరకూ వర్కౌట్ అవ్వుద్దో..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus