సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది

  • October 21, 2024 / 02:52 PM IST

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సుమన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మరియు సినిమాలో ఉండే కామెడీ కథానుగుణంగా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర గారు మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్నకుమార్ గారు పాల్గొన్నారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు, సుమన్ గారు, కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.

“మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. సముద్రమే వారి జీవనాధారం, అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం. ఈ చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర గారు మాట్లాడుతూ : సముద్రుడు టైటిల్ దర్శకుడు నగేష్ నన్ను చూసి పెట్టడం జరిగింది. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాటని నిజం చేస్తూ ఈరోజు రమాకాంత్ హీరోగా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నగేష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకులు సక్సెస్ రూపంలో ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : మొదటి సినిమానే మైథాలజికల్ సినిమా తీసిన దర్శకుడు నగేష్. ఇది తనకి 12వ సినిమా. అదేవిధంగా తన స్నేహితుడు దర్శకుడు సముద్ర తనకే సపోర్టుగా ఉండడం మంచి విషయం. దర్శకుడుగా దర్శకత్వం ఒకటే కాకుండా 24 శాఖల పైన పట్టు సాధించి నిర్మాతకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రమోషన్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చూసుకున్న వ్యక్తి నగేష్. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ముఖ్యంగా సుమన్ గారు తన సినిమాగా భావించి ప్రతి ఈవెంట్లో ప్రమోషన్స్లో పాల్గొనడం నిజంగా గర్వించదగ్గ విషయం. సినిమా చేయడం ఒకటే కాదు ప్రమోషన్స్, రిలీజ్ వరకు కూడా దాని బాధ్యతలు తీసుకున్న వాళ్లే గొప్పవాళ్లు అని చెప్పిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఈ సినిమా ప్రేక్షకులు అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు శ్రవణ్ మాట్లాడుతూ : సముద్రుడు సినిమా నా హృదయానికి హత్తుకున్న సినిమా. చాలా కష్టపడి సినిమాని తీసాం. సముద్రం పైన జాలర్ల జీవితాన్ని చూపిస్తూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న మంచి సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా దర్శకుడికి, నిర్మాతకి మంచి పేరు, డబ్బు తెచ్చి పెట్టాలని అదేవిధంగా హీరో రమాకాంత్ పెద్ద స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటులు రామరాజు గారు మాట్లాడుతూ : సముద్రుడు టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించాను. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత కీర్తన మాట్లాడుతూ : మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన దర్శకుడు వి. సముద్ర గారికి టి. ప్రసన్న కుమార్ గారికి హీరో సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దర్శకుడు నగేష్ గారు, హీరో రమాకాంత్, అవంతిక, భాను శ్రీ ఇలా ఈ సినిమాలో నటించి సపోర్ట్ చేసిన నటీనటులందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల సినిమాని ఆదరించి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో సుమన్ గారు మాట్లాడుతూ : మీకు నేను హీరో సుమన్ గా తెలుసు కానీ నా జీవితాన్ని తెలిసిన వ్యక్తి మా అన్న రామరాజు గారు. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి ఇండస్ట్రీ నుంచి సెటిల్ అయిన వ్యక్తిని నేనే. ఎన్నో కష్టాలు అధిగమించి హైదరాబాదులో తెలుగ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాను. అదేవిధంగా నగేష్ ఫస్ట్ సినిమా మైథాలజికల్ తీసి బ్రహ్మ, విష్ణు, శివుడు క్యారెక్టర్లతో సినిమాను దర్శకత్వం వహించిన వ్యక్తి. అన్నమయ్య రామదాసు తర్వాత చేసిన పాత్రలే ఎందుకు అని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్ర లో నటించాను. నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గ మంచి సినిమాల్లో ఖచ్చితంగా శ్రీ సత్యనారాయణ స్వామి సినిమా ఉంటుంది. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. సముద్రుడు సినిమా జాలర్ల జీవితాలపై ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు నగేష్ చాలా బాగా తీశాడు. ప్రేక్షకులకు ఈ సినిమా ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ : సముద్రుడు సినిమాలో నేను టీచర్ క్యారెక్టర్ లో నటించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు నగేష్ గారికి హీరో రమాకాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సినిమాకి ఫోర్త్ పిల్లర్ కెమెరామెన్ వాసు గారు. ఆయన సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. సుమన్ గారు ఈ సినిమాలో నటించి సపోర్ట్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో రమాకాంత్ మాట్లాడుతూ : మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలు దర్శకుడు వి. సముద్ర గారికి టి. ప్రసన్నకుమార్ గారికి అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. చత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను. దర్శకుడు నగేష్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్ మరియు ఆర్టిస్ట్ సొంత సినిమాగా భావించి కష్టపడి పనిచేశారు. ఒక మంచి రోల్ లో సుమన్ గారు అడగగానే ఒప్పుకొని సపోర్ట్ గా నిలబడి నటించి సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక పెద్ద సినిమాకు జరిగినట్టుగా మంచి థియేటర్లు లభించడం జరిగింది. ఈనెల 25న ప్రేక్షకులు అందరూ థియేటర్కు వచ్చి సినిమా చూసి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ : మా సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి సపోర్ట్ చేస్తున్న దర్శకుడు వి. సముద్ర గారికి టి. ప్రసన్నకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జాలర్ల జీవితాన్ని చూపించే డాక్యుమెంటరీ ఫిలిం లా కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఒక మంచి సినిమా. సముద్రం దగ్గర ఉండే జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఒక మంచి పాత్రలో అడగగానే ఒప్పుకుని నటించిన మా అన్న సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి ఆర్టిస్ట్ కి కృతజ్ఞతలు. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ, హీరో సుమన్ గారు, రాజ్ ప్రేమి, రామరాజు, శ్రవణ్, జబర్దస్త్ షేకింగ్ శేషు, చిత్రం శ్రీను, సమ్మెట గాంధీ, దిల్ రమేష్, ప్రభావతి, మోనల్, సుమన్ శెట్టి, బిహెచ్ఇఎల్ ప్రసాద్, తేజ శెట్టి, జూనియర్ రాజశేఖర్, ఫైజా జాన్ తదితరులు

టెక్నీషియన్స్ :
నిర్మాణం : కీర్తన ప్రొడక్షన్స్
నిర్మాత : బధావత్ కిషన్
సహ నిర్మాతలు : శ్రీ రామోజీ జ్ఞానేశ్వర్, సోములు నాయక్
సంగీతం : సుభాష్ ఆనంద్
డి ఓ పి : వాసు
ఎడిటర్ : నందమూరి హరి
ఫైట్స్ : నందు, సతీష్
కొరియోగ్రఫీ : అనీష్ శ్యామ్
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : నగేష్ నారదాసి
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus