కొన్ని కాంబినేషన్‌ల గురించి వినగానే ఎక్కడో తెలియని భయం కలుగుతుంది. మరికొన్ని కాంబినేషన్ల గురించి వినగానే తెలియని ఉత్సాహం కలుగుతుంది. సినిమా ఫలితం అదిరిపోతుంది అని ఇన్‌స్టంట్ నమ్మక వచ్చేస్తుంది. అలాంటి ఓ కాంబినేషన్ సెట్ అవ్వడం ఏమంత ఈజీ కాదు. ఒకవేళ సెట్ అయిందా దానిని చూసి సినిమా లవర్స్ పొంగిపోతారు. అలాంటి ఓ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. అదే ప్రేమ్ కుమార్ అండ్ ఫహాద్ ఫాజిల్.
అవును, మీరు చదివింది నిజమే. ‘96’, ‘సత్యం సుందరం’ లాంటి అదిరిపోయే మనసును హత్తుకునే సినిమాలు తెరక వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన దర్శకుడు.. సౌత్ సినిమాలో దాదాపు అన్ని భాషల్లో నటిస్తూ, మెప్పిస్తూ సెన్సేషనల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు కలవబోతున్నారట. విక్రమ్‌తో ఓ సినిమా చేయాలని ప్రేమ్ కుమార్ చాలా ఏళ్లుగా చూస్తున్నారు. అదెందుకో కానీ ఆ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ ఆలోచన వదులుకున్నారని సమాచారం.
ఈ క్రమంలో ఫహాద్ ఫాజిల్‌తో మరో సినిమా చేస్తారని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఓ యాక్షన్ థ్రిల్లర్ కథ లైన్‌లో ప్రేమ్‌కుమార్ నెరేట్ చేశారని, నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలనని ఫహాద్ భావించారని చెబుతున్నారు. యాక్షన్ కథాంశమే అయినా.. తనదైన శైలిలో హ్యూమన్ ఎమోషన్స్‌ను కథలో పొందుపరిచరాట. అందుకే ఫహాద్ వన్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు అని అంటున్నారు.
ఈ షూటింగ్ 2026 జనవరిలో మొదలుకానుందని సమాచారం. అయితే అంతకుముందు ఓపెనింగ్ జరుపుకుంటారట. ఈ సినిమాను తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. ప్రేమ్ కుమార్, ఫహాద్‌కు ఈ మూడు భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. వాళ్ల గత సినిమా బాగా ఆడి ఉన్నాయి కూడా. మరి ఈ ‘ఆవేశం’ స్టార్ కోసం ఎమోషన్స్ స్టార్ ఎలాంటి కథ రాశారో చూడాలి.