Actress: ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా?

హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే అందం, టాలెంట్ ఉంటే సరిపోదు. కొంచెం అదృష్టం కూడా ఉండాలి అంటుంటారు. కొంతమంది హీరోయిన్లకు పైన చెప్పుకున్న రెండూ ఉన్నప్పటికీ .. అదృష్టం అనేది లేక త్వరగానే ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారికి చెందిన హీరోయినే మీరు పైన చూస్తున్న ఫొటోలో ఉన్న బ్యూటీ అని చెప్పాలి. ఈమె టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఓ సినిమా చేసింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది.

కానీ టీవీల్లో ఆ సినిమాని చూసిన ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ అంటుంటారు. ఆ సినిమా మరేదో కాదు ‘ప్రేమకథ’. ఆ సినిమాలో హీరోయినే మీరు పైన చూస్తున్న ఫొటోలో ఉన్న బ్యూటీ అని చెప్పాలి. సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ప్రేమకథ’ చిత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంతో అంతర మాలి అనే హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమాలో మంచి నటన కనపరిచిన ఈమె తన అందంతో కూడా కట్టిపడేసింది.

రాంగోపాల్ వర్మ దర్శకుడు కాబట్టి..(Actress) ఈమె గ్లామర్ ను అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులకు వడ్డించాడు. సినిమా ప్లాప్ అయినా ఈమె క్లిక్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. 1998 వ సంవత్సరంలో సినీ రంగప్రవేశం చేసిన ఈమె బాలీవుడ్లో పలు హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఈమె కెరీర్ అంత సాఫీగా సాగలేదు.. వెంటనే ఫేడౌట్ అయిపోయింది.

2009 లో చే కురియాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సెటిల్ అయ్యింది. ‘ప్రేమ కథ’ తర్వాత ఈమె మళ్ళీ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు అలాగే ఫ్యామిలీ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus