బిక్షగాడిగా… మారిన ప్రేమిస్తే సినిమా నటుడు!
- June 27, 2017 / 11:22 AM ISTByFilmy Focus
సినిమా…సినిమా…సినిమా…నిజమే పిచ్చి అనుకోవాలో…వ్యసనం అనుకోవాలో, లేక వృత్తిగా భావించాలో తెలీదు కానీ…ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా అంటేనే ఒక ప్రపంచం. ఒక్కసారి అవకాశం వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకునే వారు కొందరు అయితే, ఎలా అయినా ఒక్క ఆవకాశంతో ప్రూవ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకునే వారు ఎందరో…ఇదిలా ఉంటే సినిమా ప్రపంచంలో తారాలుగా వెలిగిన వాళ్ళలో కొందరు జీవితాలు చివరి సమయంలో చిన్నాబిణ్ణం అయిపోయాయి అని మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు అలాంటి కధనే మరోసారి మన చదవాల్సి వస్తుంది…అసలు మ్యాటర్ లోకి వెళితే…13 ఏళ్ల కిందట నటుడు భరత్- సంధ్య జంటగా నటించిన ‘కాదల్’ ఫిల్మ్ సంచలన విజయం సాధించిన విషయం మనకు ఇంకా గుర్తు ఉంది. అయితే ఆ సినిమాని తెలుగులో ‘ప్రేమిస్తే’ గా డబ్బింగ్ సైతం చేశారు…ఇక్కడ సైతం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక యధార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఈ చిత్రంలో పల్లుబాబుగా అలరించిన ఆ నటుడు గుర్తు ఉన్నాడా?? తన కామెడీ టైమింగ్ తో అందరినీ అలరించిన ఆ పల్లు బాబు….ఆ తర్వాత సినిమా చాన్సులు రాకపోవడంతో…ఓ వైపు పేదరికం, మరోవైపు పేరెంట్స్ మరణంతో మానసికంగా కుంగిపోయాడు. ప్రేమిస్తే చిత్రంలో కూడా సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా నటించాడు. నిజ జీవితంలో కూడా అతనికి ఏమీ కలిసి రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి..చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరైన స్పందించి ఈ పల్లు బాబుకి అవకాశాలు కల్పిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












