రాజకీయ నాయకులూ సినీ రంగం లోకి వచ్చి సినిమాలను నిర్మించడం అనేది కొత్తేమి కాదు. గతం లో ఎంతోమంది అలా సినిమాలను నిర్మించి సూపర్ హిట్ లు అందుకున్నాడు. అలా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అప్పట్లో పలు సినిమాలకు పెట్టుబడి దారుడిగా,పంపిణీదారుడిగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆయన తనయుడు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ కి ఆరోజుల్లో సినిమాలు అంటే చాలా మక్కువ.
అప్పట్లో ఆయన నందమూరి బాలకృష్ణ (Balakrishna) కడప జిల్లా ప్రెసిడెంట్ కూడా పని చేసాడు. బాలయ్య సినిమా విడుదలైనప్పుడల్లా ఫ్లెక్సీలు, కటౌట్లతో థియేటర్స్ ని నింపేసేవారట. అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా వై ఎస్ జగన్ వ్యహరించినప్పుడు పేపర్ యాడ్స్ కూడా సోషల్ మీడియా లో ఎన్నో ప్రచారం అయ్యాయి. ఇదంతా పక్కన బాలయ్య మీద అభిమానం తో అప్పట్లో జగన్ ఒక సినిమాని కొనుగోలు చేసాడట.
ఆ సినిమా మరేదో కాదు, సీమసింహం. ఈ చిత్రం కొనుగోలు చెయ్యడానికి జగన్ తన తండ్రితో గొడవపడి మరీ కొనుగోలు చేసాడట. తీరా చూస్తే ఆ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. రాయలసీమ ప్రాంతం మొత్తానికి కలిపి ఈ సినిమా రన్నింగ్ పూర్తి అయ్యాక ఒక్క రూపాయి కూడా మిగలలేదు. దీనితో రాజశేఖర్ రెడ్డి గారు అప్పుల పాలవ్వడం తో తన ఇంటిని తాకట్టు పెట్టి అప్పులు తీర్చాల్సి వచ్చిందట.
ఆ తర్వాత మళ్ళీ ఈ కుటుంబం సినిమాల వైపు చూడలేదు. కానీ చాలాకాలం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి కూతురు వై ఎస్ షర్మిల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని హీరో గా పెట్టి ‘యోగి’ అనే సినిమాని నిర్మించింది. ఈ చిత్రం కూడా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఈ సినిమా 18 వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అవ్వబోతుంది, రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలిమరి.