బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ? అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇక ఒకే ఒక్కవారం ఉండటంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? లేదా సింగిల్ ఎలిమినేషనా ? అసలు ఎవరినీ ఎలిమినేట్ చేయరా అనేది ఆసక్తిగా మారింది. అయితే, యావర్ ని ఎలిమినేట్ చేయబోతున్నారా అనే సందేహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు మేటర్లోకి వెళితే., ఈ సీజన్లో లాస్ట్ వీక్ ఒకటే ఉంది. కానీ హౌస్ లో మొత్తం 7గురు ఉన్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలని కావాలనే ఉంచారు.
ఒకవేళ స్పాన్సర్ టాస్క్ లకోసం ఆఖరి వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్ ఉండాలని అనుకుంటే ఒకరిని మేల్ కంటెస్టెంట్ ని పంపించేస్తారు. ఓటింగ్ లో వీక్ గా ఉంది అర్జున్. కానీ, అర్జున్ ఇప్పటికే ఫినాలే టిక్కెట్ పవర్ తో ఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు. ఇక మిగిలింది యావర్ ఒక్కడే అందుకే యావర్ అవుట్ అవుతాడా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్ అఫీషియల్ పోలింగ్స్ ఒక్కసారి చూసినట్లయితే., ఎప్పటిలాగానే పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. దాదాపుగా 32 శాతం ఓటింగ్ అనేది జరిగింది. ఇంకా జరుగుతోంది.
ఇంకోక్క వారం రోజులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కప్ ఎగరేసుకుని పోతాడు. ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ గా నిలిచి బిగ్ బాస్ లో చరిత్ర సృష్టిస్తాడు. తర్వాత రెండో పొజీషన్ లో శివాజీ ఉన్నాడు. శివాజీకి 25శాతం ఓటింగ్ అనేది జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ కి ఏమైనా పోటీ లాస్ట్ వరకూ వస్తే శివాజీనే వస్తాడు. లేదా అమర్ కి వచ్చే అవకాశం ఉంది. అమర్ కి కూడా 22 శాతం వరకూ ఓటింగ్ అనేది జరుగుతోంది. అమర్ కి అఫీషియల్ ఓటింగ్ అనేది ఎలా ఉందో తెలిదు.
పైగా ఈవీక్ బాగా బ్యాడ్ అయ్యింది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది గత రెండు రోజుల్నుంచీ పెరిగింది. శివాజీకి కూడా పెరిగింది. కాబట్టి మరి అమర్ పుంజుకుంటాడా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత యావర్ ఉన్నాడు. యావర్ కి 9 పర్సెంట్ ఓటింగ్ జరిగితే అర్జున్ కి 5 పర్సెట్ ఓటింగ్ జరిగింది. ప్రియాంకకి 4 శోభాకి 3 ఇలా ఓటింగ్ అనేది సెటిల్ అయ్యింది. మరి లెక్క ప్రకారం అయితే శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలి. కానీ, ఆటపిల్లలు ఫినాలేలో ఉండాలి అంటే మాత్రం యావర్ ని పంపిస్తారు.
ఎందుకంటే, అర్జున్ సేఫ్ కాబట్టి , అర్జున్ నేరుగా ఫినాలేకి వెళ్తాడు. యావర్ ని ఎలిమినేట్ చేస్తారు. అలా కాకుండా అన్ ఫైయిర్ అని అనిపిస్తే టాప్ 7ని బిగ్ బాస్ హౌస్ లో అలాగే ఉంచేస్తారు. అప్పుడు వీకెండ్ జెర్నీలతో ముగించేస్తారు. లాస్ట్ లో ఒక్కరోజు ముందు రీ యూనియన్ ఉంటే ఉంటుంది. గ్రాండ్ ఫినాలే షూటింగ్ వచ్చి 16వ తేదినే జరుగుతుంది. అది 17న టెలికాస్ట్ అవుతుంది. గ్రాండ్ ఫినాలేకి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7 Telugu) ముస్తాబవుతుంది. మరి ఈసారి అన్ ఫెయిల్ ఎలిమినేషన్ చేస్తారా ? లేదా టాప్ 7 ఫినాలేలోకి అడుగుపెడతారా లేదా అనేది చూద్దాం. అదీ మేటర్.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!