ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే ప్రశ్నకు సరైన జవాబు లేదు కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ కు ప్రభాస్ ఎంత కష్టపడ్డారో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సైతం అంతే కష్టపడ్డారు.
వరదరాజమన్నార్ పాత్రకు తాను తప్ప మరెవరూ న్యాయం చేయలేరనే విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా 911 GT3 పోర్షే కారును కొనుగోలు చేయగా ఈ కారు ఎక్కువ పనితీరు ఉన్న హోమోలోగేషన్ మోడల్ కారు కావడం గమనార్హం. ఈ కారు 375 కిలోవాట్ల పనితీరును కలిగి ఉందని తెలుస్తోంది. ఈ కారు 6 స్పీడ్ జీటీ స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉందని భోగట్టా. ఈ కారు ఖరీదు 3 కోట్ల రూపాయలు అని సమాచారం.
పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా రాబోయే రోజుల్లో అయినా సలార్2 గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. సలార్2 మూవీ సలార్1 మూవీని మించి ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో ఈ సినిమాకు సంబంధించి స్పష్టత రావడం లేదు. వరుస విజయాలతో ప్రభాస్ మార్కెట్ పెరుగుతుండగా వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా త్వరలో రాజాసాబ్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ పారితోషికం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా కల్కి సినిమాకు ప్రభాస్ పరిమితంగానే తీసుకున్నారని తెలుస్తోంది.