Prithviraj: ఆ కుటుంబానికి అండగా నిలిచిన జయరాం, పృథ్వీరాజ్.. ఏమైందంటే?

ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే స్పందించే గొప్ప మనస్సు, సాయం చేసే మంచి గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలా సాయం చేసే మంచి మనస్సు ఉన్న హీరోలలో ప్రముఖ నటులు జయరాం, పృథ్వీరాజ్ సుకుమారన్ ముందువరసలో ఉంటారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని వెల్లియామాఘాట్ లో కలుషిత ఆహారం తినడం వల్ల 15 ఆవులు మృతి చెందాయి. ఈ పశువులు 18 సంవత్సరాల వయస్సు ఉన్న జార్జ్, 15 సంవత్సరాల వయస్సు ఉన్న మాథ్యూలకు చెందినవి కాగా మూడేళ్ల క్రితం జార్జ్, మాథ్యూల తండ్రి మరణించారు.

జార్జ్, మాథ్యూ ఒకవైపు స్కూల్ కు వెళ్తూనే మరోవైపు ఆవులను పెంచుకుంటున్నారు. ఆవులు చనిపోవడంతో జార్జ్, మాథ్యూ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో జార్జ్, మాథ్యూ ఉత్తమ బాల పాడి రైతు అవార్డ్ ను గెలుచుకున్నారు. డిసెంబర్ నెల 31వ తేదీన ఆవులు చనిపోగా ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.

ఈ విషయం తెలిసిన వెంటనే నటుడు జయరాం జార్జ్ మాథ్యూలను కలవడంతో పాటు 5 లక్షల రూపాయలు అందించారు. జయరామ్ మీడియాతో మాట్లాడుతూ మమ్ముట్టి లక్ష రూపాయలు, పృథ్వీరాజ్ సుకుమారన్ 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. సలార్ సినిమాలో వరద రాజమన్నార్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన పృథ్వీరాజ్ సుకుమారన్ 2 లక్షల రూపాయల సహాయం ప్రకటించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj) భవిష్యత్తు ప్రాజెక్ట్ లను తెలుగులో కూడా విడుదల చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పృథ్వీరాజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సలార్ సక్సెస్ తో పృథ్వీరాజ్ సుకుమారన్ రేంజ్ మరింత పెరిగింది. సలార్2 మూవీ కోసం ఎదురుచూస్తున్నామని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus