మన మెగాస్టార్‌ను రెండుసార్లు కాదని.. ఆ మెగాస్టార్‌కు ఇప్పుడు ఎస్‌ అని!

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) … నటన కోసం, సినిమా కోసం ఎంతైనా కష్టపడే రకం. ఆ విషయం మొన్నీమధ్య వచ్చిన ‘గోట్‌ లైఫ్‌: ఆడు జీవితం’ (The Goat Life) సినిమానే చెప్పేస్తుంది. సినిమా ఎంతవరకు జనాలకు కనెక్ట్ అయింది అనే విషయం పక్కనపెడితే… ఆయన కష్టం మాత్రం అద్భుతం అని చెప్పాలి. ఆ విషయం పక్కనపెడితే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇప్పుడు ఓకే చేశాడు అంటున్న కొత్త సినిమా ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఆయన అనుకుని చేసింది కాదు… తన కల పూర్తయింది కాబట్టి ఈ సినిమా ఓకే చేశాడు అని చెప్పాలి.

ఇక అసలు విషయానికొస్తే మలయాళ సినిమా మెగాస్టార్‌ మమ్ముట్టితో (Mammootty) పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా ఒకటి చేస్తున్నాడు. మామూలుగా అయితే ఇది ఆసక్తికర సినిమానే… అయితే ఈ కాంబినేషన్‌ 14 ఏళ్ల తర్వాత కుదరుతోంది అంటే ఇంకా ఆసక్తికరం అని చెప్పాలి. ‘భ్రమయుగం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మమ్ముట్టి… పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ఓ థ్రిల్లర్‌ కథలో నటించిననున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా, పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్.

ఆంటో జోసెఫ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు హ్యాండిల్‌ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందట. అప్పుడు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు అని అంటున్నారు. ఇందాక 14 ఏళ్లు అని అన్నాం కదా… అది 2010లో వచ్చిన ‘పోకిరి రాజా’ సినిమా. అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలసి నటిస్తున్నారు. మరి ఎలాంటి ఇంపాక్ట్‌ చూపిస్తారో ఈ సినిమా అనేది చూడాలి.

ఇక మలయాళం సినిమా సంగతి చూస్తే… ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఆరు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అందులో రెండు సినిమాలు రూ.100 కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తే… ఒకటి దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు అందుకుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus