బిగ్‌బాస్ హౌస్‌లో ఏది ప్లస్ అవుతుందో, ఏది మైనస్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన క్వాలిటీనే, నేడు దారుణమైన ట్రోలింగ్‌కి కారణం కావచ్చు. కామన్ల కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియా శెట్టి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. తన వాయిస్, మాట్లాడే తీరు వల్లే సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ ట్రోలింగ్‌పై ప్రియా శెట్టి టీమ్ స్పందించింది. తన పేరెంట్స్‌తో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. “నా వాయిస్ పుట్టుకతో వచ్చింది. దాన్ని నేనేం చేయలేను. ‘అగ్నిపరీక్ష’ సమయంలో ఇదే వాయిస్‌ను, ఇదే క్యూట్‌నెస్‌ను చూసి కదా నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు మెచ్చుకున్నవాళ్లే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
ఇది నా సహజమైన తీరు, దీన్ని మార్చుకోలేను” అంటూ తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చింది.కామన్ల బ్యాచ్ నుంచి ఇప్పటికే మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వడంతో మిగిలిన వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ప్రియా శెట్టి పేరు డేంజర్ జోన్‌లో బలంగా వినిపిస్తోంది. హౌస్‌లోకి రావడానికి ప్లస్ పాయింట్‌గా నిలిచిన ఆమె వాయిస్, ఇప్పుడు ఆమె ఎలిమినేషన్‌కు కారణమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
తనను అర్థం చేసుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియా, తనను ఆడియన్స్ ఎంతవరకు అర్థం చేసుకుంటారో చూడాలి.