టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ప్రియదర్శికి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రియదర్శి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. సినిమాల్లోకి వెళతాను అంటే కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ప్రియదర్శి పేర్కొన్నారు. టెర్రర్ సినిమాలోని పాత్రతో నా కెరీర్ మొదలైందని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.
పెళ్లిచూపులు సినిమాతో నా కెరీర్ లో చాలా మార్పు వచ్చిందని ప్రియదర్శి పేర్కొన్నారు. తరుణ్ భాస్కర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అని ఆయన చెప్పుకొచ్చారు. మ్లల్లేశం సినిమా కథ విని నేను ఎమోషనల్ అయ్యానని ప్రియదర్శి కామెంట్లు చేశారు. మల్లేశం మూవీలోని పాత్రను చూసి చాలామంది ప్రశంసించారని ప్రియదర్శి అన్నారు. మల్లేశం మూవీ తర్వాత చేనేత కుటుంబాల గురించి తెలుసుకున్నానని ప్రియదర్శి కామెంట్లు చేశారు.
విజయ్ దేవరకొండ నాకు మంచి ఫ్రెండ్ అని ప్రియదర్శి పేర్కొన్నారు. మహేష్ బాబు గారు నన్ను చూసి నువ్వా అని ప్రేమగా పలకరించాలని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. మహేష్ సినిమాలలో ఎంత కామెడీ చేస్తారో తెర వెనుక కూడా అంతే జోవియల్ గా ఉంటారని ప్రియదర్శి కామెంట్లు చేశారు. తారక్ తో మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని ఆయన కామెంట్లు చేశారు.
తారక్ నాతో రిహార్సల్స్ చేయించేవారని అలా చేయడం వల్ల నాలో భయం పోయిందని ప్రియదర్శి పేర్కొన్నారు. వెంకటేష్ గారు చాలా సింపుల్ గా ఉంటారని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నానని ప్రియదర్శి అన్నారు. షార్ట్ ఫిల్మ్స్ తో నా కెరీర్ మొదలైందని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. ప్రియదర్శి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియదర్శి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియదర్శికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రియదర్శి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.